హోమ్ /వార్తలు /క్రైమ్ /

Woman suicide : పెళ్లైన 4ఏళ్లలోనే నరకం చూసింది .. భర్త అనుమానం భరించలేక ఆమె ఏం చేసిందంటే

Woman suicide : పెళ్లైన 4ఏళ్లలోనే నరకం చూసింది .. భర్త అనుమానం భరించలేక ఆమె ఏం చేసిందంటే

(Photo Credit:Youtube)

(Photo Credit:Youtube)

Woman suicide: పెళ్లి చేసుకొని మెట్టినింట్లో అడుగుపెట్టే ప్రతి ఆడపిల్ల అక్కడి వాళ్లందరూ తనను బాగా చూసుకుంటారనే కలలు కంటుంది. కోటి ఆశలతో , కొత్త ఆనందంతో కొత్త వ్యక్తుల మధ్యకు వస్తుంది. అయితే అత్తారింట్లో అడుగుపెట్టిన యువతికి మొగుడే యుముడని తెలుసుకొని భరించలేకపోయింది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Nirmal, India

పెళ్లి చేసుకొని మెట్టినింట్లో అడుగుపెట్టే ప్రతి ఆడపిల్ల అక్కడి వాళ్లందరూ తనను బాగా చూసుకుంటారనే కలలు కంటుంది. కోటి ఆశలతో , కొత్త ఆనందంతో కొత్త వ్యక్తుల మధ్యకు వస్తుంది. అయితే అత్తారింట్లో అడుగుపెట్టిన యువతికి మొగుడే యుముడని తెలుసుకొని భరించలేకపోయింది. కేవలం డబ్బు కోసం(Extra dowry)కట్టుకున్న భార్యను చిత్రహింసలకు గురి చేస్తుండటంతో బ్రతకడం వృధా అని నిర్ధారించుకుంది. అందుకే పెళ్లి చేసుకున్న నాలుగేళ్లకే నూరేళ్ల జీవితానికి ముగింపు పలికింది. నిర్మల్(Nirmal)జిల్లాలో ఓ వివాహిత బలవన్మరణం(Suicide) సంచలనంగా మారింది.

Chiranjeevi : మెగా పిక్చర్..నేడు చిరుకి నాడు చెర్రికి డిఫరెంట్‌గా బర్త్‌డే విషెస్ చెప్పిన ఫ్యాన్స్నాలుగేళ్లకే నూరేళ్లు నిండాయి..

నిర్మల్‌ జిల్లా గంజాల్‌లో ఓ వివాహిత బలవన్మరణానికి పాల్పడింది. దిలావర్‌పూర్‌ మండలం కంజర్‌ గ్రామానికి చెందిన అడెల్ల శంకర్‌ కూతురు అరుణ అనే 24సంవత్సరాల వయసున్న మహిళకు సోన్‌ మండలం గంజాల్‌ గ్రామానికి చెందిన గుండారపు గంగాసాగర్‌తో వివాహం జరిగింది. నాలుగేళ్ల క్రితం అంటే 2018లో గంగాసాగర్‌ కోరినట్లుగా కట్న, కానుకలు ఇచ్చి అరుణ తల్లిదండ్రులు ఘనంగా వివాహం జరిపించారు. ఏడాదిలో సంస్కృతి అనే ఆడపిల్లకు జన్మనిచ్చింది. అరుణ భర్త గంగాసాగర్‌ ఫోటోగ్రాఫర్ కావడంతో ఆదాయం పెద్దగా వచ్చేది కాదు. దాంతో పెళ్లి చేసుకున్న కొద్ది రోజుల తర్వాత నుంచి భార్యను అదనపు కట్నం తీసుకురమన్ని వేధించాడు.

అదనపు కట్నం, అనుమానంతో వేధింపులు..

డబ్బుతో అవసరం ఉందని పుట్టింటి నుంచి ఒక లక్ష రూపాయలు తీసుకురమ్మని వేధించసాగాడు. ఆమె తీసుకురాకపోవడంతో భార్యపై అనుమానం పెంచుకుని మానసికంగా వేధించాడు. భర్త గంగాసాగర్‌ వేధింపులు తాళలేకపోయిన అరుణ విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పింది. వాళ్లు సైతం పెద్దల సమక్షంలో పంచాయితీలు పెట్టారు. బుద్ధిగా వుంటానని ...భార్యను బాగా చూసుకుంటానని చెప్పిన గంగాసాగర్ ఇంటికి తెచ్చుకొని మళ్లీ వేధించడం మొదలుపెట్టాడు.

Telangana | Amit Shah: తెలంగాణలో అడుగుపెట్టిన అమిత్‌షా .. పార్టీ కార్యకర్త ఇంట్లో కేంద్ర హోంమంత్రికి టీ పార్టీభరించలేకపోయిన వివాహిత..

భర్త డబ్బు పిశాచిలా వేధిస్తూ ఉండటంతో భరించలేకపోయిన అరుణ మానసిక సంఘర్షణకు గురైంది. భర్త రూపంలో ఉన్న డబ్బు పిశాచి వేధింపులు మరింత ఎక్కువ కావడంతో శనివారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరి వేసుకొని ప్రాణాలు తీసుకుంది అరుణ. ప్రస్తుతం మృతురాలికి మూడేళ్ల కూతురు ఉంది. అరుణ చావుకు తన బావ గంగాసాగర్‌ కారణమని ఆరోపిస్తూ మృతురాలి సోదరుడు నల్ల అనిల్‌ పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లుగా ఎస్సై రవీందర్‌ తెలిపారు.

Published by:Siva Nanduri
First published:

Tags: Crime news, Nirmal, Telangana News, Women suicide

ఉత్తమ కథలు