Home /News /crime /

Married Woman: కొన్ని నెలల కిందట పెళ్లి చేసుకున్న యువతి.. ఆనందంగా సాగిపోతున్న కాపురం.. కానీ అలా జరగడంతో..

Married Woman: కొన్ని నెలల కిందట పెళ్లి చేసుకున్న యువతి.. ఆనందంగా సాగిపోతున్న కాపురం.. కానీ అలా జరగడంతో..

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

ధరూర్ మండలం మండలంలోని మార్లబీడు (Marlabeedu) గ్రామానికి చెందిన రేణుక(20)ను జాముపల్లె గ్రామానికి చెందిన గోపాల్ కు ఇచ్చి కొన్ని నెలల కిందట వివాహం చేశారు.

    ఆమెకు ఇది వరకే పెళ్లి జరిగింది. అయితే ఆమెను ఓ యుయకుడు వేధించాడు. తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చాడు. ఈ క్రమంలోనే ఆమె షాకింగ్ నిర్ణయం తీసుకుంది. వేధింపులతో తీవ్ర మనస్తాపం చెందిన ఆమె ఆత్మహత్య (Suicide) చేసుకుంది. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ధరూర్ మండలం మండలంలోని మార్లబీడు (Marlabeedu) గ్రామానికి చెందిన రేణుక(20)ను జాముపల్లె గ్రామానికి చెందిన గోపాల్ కు ఇచ్చి కొన్ని నెలల కిందట వివాహం చేశారు. ప్రస్తుతం ఆమె భర్తతో కలిసి జాముపల్లెలో నివాసం ఉంటుంది.

    అయితే సెప్టెంబర్ 25వ తేదీన రేణుక వ్యవసాయ పొలానికి వెళ్లింది. అయితే పొలం వద్ద ఒంటరిగా ఉన్న రేణుకను అదే గ్రామానికి చెందిన గాళ్ల వీరేశ్‌ తన కోరిక తీర్చాలంటూ వేధించాడు. వీరేశ్‌ బంధువులు కొందరు వీరేశ్‌ను పెళ్లి చేసుకోవాలని రేణుకపై బెదిరింపులకు పాల్పడ్డారు. ఇక, సెప్టెంబర్ 26న రేణుక మార్లబీడులోని పుట్టింటికి వెళ్లింది. జరిగిన ఘటనలపై మనస్తాపం చెందిన రేణుక.. మంగళవారం మార్లబీడులో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. అయితే దీనిని ఆలస్యంగా గమనించిన కుటుంబ సభ్యులు రేణుకను కర్నూలులోని ఆస్పత్రికి (Kurnool Hospital) తరలించేందుకు యత్నించారు. అయితే రేణుక మార్గమధ్యలో రేణుక మృతి చెందింది.

    Junior Artist Suicide: ఆమె తెలుగు సినీ పరిశ్రమలో జూనియర్ ఆర్టిస్ట్.. అలా జరగడంతో ఆత్మహత్య.. గదిలో నుంచి..

    రేణుక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టుగా పోలీసులు తెలిపారు. వీరేశ్​తో పాటు కుటుంబసభ్యులపై కేసు నమోదు చేసినట్లు గద్వాల సీఐ షేక్ మహబూబ్ బాషా చెప్పారు.

    Shocking: కాలేజ్‌కు వెళ్లేటప్పుడు బస్సు కండక్టర్‌తో ప్రేమ.. పెళ్లి కూడా చేసుకున్నారు.. ఎన్నో మలుపులు.. రాత్రి అలా ప్రశ్నించడంతో..

    ఆదిలాబాద్‌లో ప్రేమించినవాడు మోసం చేశాడని..
    ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం జామ్నికి చెందిన పెందూర్‌ రవీందర్, గంగుబాయి రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరు పెళ్లి చేసుకుందామని అనుకన్నారు. అయితే ఇటీవల రవీందర్ వేరే యువతిని వివాహం చేసుకుంటానని గంగుబాయికి తెలిపాడు. దీంతో గంగుబాయి మనస్తాపం చెందింది. ఈ క్రమంలోనే ఈ నెల 24 పురుగుల మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను చికిత్స కోసం రిమ్స్‌కు తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. గంగుబాయి తల్లి శోభబాయి ఫిర్యాదు మేరకు పోలీసులు రవీందర్‌పై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.
    Published by:Sumanth Kanukula
    First published:

    Tags: Crime news, Suicide, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు