భర్త, అత్తమామల వేధింపులు... వివాహిత అనుమానాస్పద మృతి

ఇబ్రహీంపట్నం పరిధిలోని కప్పాడ్ గ్రామానికి చెందిన అక్షితను .. రెండేళ్ళ క్రితం శంషాబాద్ కు చెందిన రాఘవేందర్ రెడ్డికి ఇచ్చి ఘనంగా వివాహం జరిపించారు.

news18-telugu
Updated: May 20, 2019, 12:50 PM IST
భర్త, అత్తమామల వేధింపులు...  వివాహిత అనుమానాస్పద మృతి
నమూనాచిత్రం
news18-telugu
Updated: May 20, 2019, 12:50 PM IST
అత్తింటి ఆరాళ్లకు మరో ఆడపడుచు బలైపోయింది. అదనపు కట్నం పేరుతో భర్త అత్తమామలు పెట్టిన బాధ భరించలేకపోయింది. తన తల్లిదండ్రులకు మరింత భారం కాకూడదనుకుంది. అనుకున్నదే తడువుగా అర్థంతగా తనువు చాలించింది. వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్‌లో జరిగింది. శంషాబాద్ ఆర్బీ నగర్ కాలనీకి చెందిన నివాసముంటున్న అక్షిత అనుమానాస్పదంగా మృతిచెందింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పరిధిలోని కప్పాడ్ గ్రామానికి చెందిన అక్షితను .. రెండేళ్ళ క్రితం శంషాబాద్ కు చెందిన రాఘవేందర్ రెడ్డికి ఇచ్చి ఘనంగా వివాహం జరిపించారు. వివాహం సమయంలో భారీగానే కట్నకానుకలు సమర్పించారు. అయినా వాటితో రాఘవేందర్ రెడ్డి కడుపునిండలేదు. మరింత డబ్బు పుట్టింటినుంచి తీసుకురావలంటూ భార్యను టార్చర్ పెట్టడం మొదలుపెట్టాడు. భర్త వేధింపులే భరించలేకపోతున్న అక్షితతో అత్తమామలు కూడా అదేబాటలో వ్యవహరించారు. దీంతో బతకలేక... తల్లిదండ్రులకు మరింత భారం లేక పాపం ఆ అభాగ్యురాలు ఇంట్లోనే ఉరి వేసుకుంది.

దీంతో అక్షిత ఆత్మహత్యకు సంబంధించిన సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. భర్తతో పాటు అత్తా మామలు ఈ ఘటన జరిగిన వెంటనే ఇంటికి తాళం వేసి పారిపోయినట్లు తెలుస్తోంది. ఆదివారం ఉదయం ఘటనా స్థలానికి చేరుకున్న అక్షిత కుటుంబ సభ్యులు భర్త ఇంటి ఎదుట బైఠాయించారు. భర్త రాఘవేందర్ రెడ్డితో పాటు అత్తా మామలే తమ కూతురిని హత్య చేసి, ఆత్మహత్యగా చిత్రీకరించారని ఆరోపించారు. పెళ్ళి సమయంలో 50 లక్షలు కట్నంగా చెల్లించామని.. అయితే తమ కూతురిని ఇలా పొట్టన బెట్టుకుంటాడని అనుకోలేదని కన్నీరు మున్నీరయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

First published: May 20, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...