Home /News /crime /

MARRIED WOMAN CHEATED BY LOVER IN KAMAREDDY WHO WISH TO BEGIN NEW LIFE WITH HIM SSR

Kamareddy: దుబాయ్‌లో భర్త.. ఏడాదిగా మరో వ్యక్తితో భార్య .. చివరకు ఆమెకు మిగిలింది ఈ కామారెడ్డి బస్టాండే..

మోసపోయి బస్టాండ్‌లో కూర్చున్న మహిళను విచారిస్తున్న పోలీసులు

మోసపోయి బస్టాండ్‌లో కూర్చున్న మహిళను విచారిస్తున్న పోలీసులు

ఆమెకు పెళ్లైంది. మూడేళ్ల వయసున్న కొడుకు ఉన్నాడు. భార్య, కొడుకును పోషించుకునేందుకు భర్త ఉపాధి నిమిత్తం వేరే దేశానికి వెళ్లాడు. కుటుంబ ఖర్చులకు డబ్బు పంపుతూ భార్యా, కొడుకుకు దూరంగా ఉంటున్నప్పటికీ కుటుంబాన్ని సుఖంగానే చూసుకుంటున్నాడు.

ఇంకా చదవండి ...
    నిజామాబాద్: ఆమెకు పెళ్లైంది. మూడేళ్ల వయసున్న కొడుకు ఉన్నాడు. భార్య, కొడుకును పోషించుకునేందుకు భర్త ఉపాధి నిమిత్తం వేరే దేశానికి వెళ్లాడు. కుటుంబ ఖర్చులకు డబ్బు పంపుతూ భార్యా, కొడుకుకు దూరంగా ఉంటున్నప్పటికీ కుటుంబాన్ని సుఖంగానే చూసుకుంటున్నాడు. కానీ.. ఆ మహిళ వేరే వ్యక్తి మాయలో పడింది. ఆ వ్యక్తి అందినకాడికి సొమ్ము కాజేసి వదిలి వెళ్లిపోవడంతో మోసపోయి బస్టాండ్‌లో మూడేళ్ల పిల్లాడితో దిక్కుతోచని స్థితిలో కూర్చుని ఉంది. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిర్మల్ జిల్లా బాసర మండలం యంచ గ్రామానికి చెందిన లక్ష్మి, సాయిలు భార్యాభర్తలు. భార్యాబిడ్డలను పోషించుకునేందుకు పెళ్లయిన కొన్నేళ్లకు సాయిలు ఉపాధి నిమిత్తం దుబాయ్ వెళ్లాడు. భర్త ఇంట్లో లేకపోవడంతో లక్ష్మికి గతేడాది లింబ గ్రామానికి చెందిన పాపన్నతో పరిచయం ఏర్పడింది. ఇద్దరి మధ్య చనువు పెరిగింది. ఈ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. కొడుకు మూడేళ్ల వయసున్న పిల్లాడు కావడంతో ఆ బాబును నిద్రబుచ్చి.. రోజూ లక్ష్మి ఇంట్లోనే పాపన్న, లక్ష్మి వివాహేతర సంబంధం కొనసాగించేవారు. లక్ష్మి ఏ స్థాయిలో పాపన్న మాయలో పడిపోయిందంటే.. భర్తను వదిలేసి అతనితో వెళ్లిపోయేందుకు సిద్ధపడింది.

    ఈ క్రమంలోనే.. ఆమెను జీవితాంతం చూసుకుంటానని పాపన్న నమ్మించాడు. పిల్లాడిని కూడా తీసుకెళదామని నమ్మబలికాడు. ఆమె నిజమేననుకుని నమ్మి మూడ్రోజుల క్రితం లక్ష్మి పిల్లాడిని తీసుకుని పాపన్నతో కలిసి సదాశివనగర్‌కు వెళ్లింది. అక్కడ పాపన్న స్నేహితుడి ఇంట్లో ఇద్దరూ రెండు రోజులు కలిసి ఉన్నారు. ఆ తర్వాత రోజు లక్ష్మిని, ఆమె కొడుకును పాపన్న కామారెడ్డి పట్టణానికి తీసుకెళ్లాడు. అక్కడ లక్ష్మి చెవి కమ్మలను తాకట్టు పెట్టించాడు. అవి తాకట్టు పెట్టడంతో రూ.9వేలు వచ్చాయి. ఆ డబ్బు తీసుకున్న పాపన్న.. లక్ష్మిని, పిల్లాడిని తీసుకుని కామారెడ్డి బస్టాండుకు వచ్చాడు. తన స్నేహితుడికి ఫోన్ చేస్తానని.. కామారెడ్డిలో ఇల్లు అద్దెకు తీసుకుని ఇక్కడే ఉందామని లక్ష్మికి చెప్పాడు. తన ఫోన్‌లో బ్యాలెన్స్ అయిపోయిందని.. కాల్ చేయడానికి ఫోన్ ఇవ్వాలని లక్ష్మి ఫోన్ తీసుకున్నాడు.

    ఇది కూడా చదవండి: Father Big Mistake: భార్య ఇంట్లో లేని సమయంలో.. క్షణికావేశంలో నలుగురు పిల్లల తండ్రి చేసిన పనికి..

    బాత్రూమ్‌కు వెళ్లి వస్తానని.. ఇక్కడే కూర్చోండని చెప్పి పాపన్న వెళ్లాడు. అలా వెళ్లిన పాపన్న గంట గడుస్తున్నా తిరిగి రాలేదు. బస్టాండు చుట్టుపక్కల కూడా ఎక్కడా కనిపించలేదు. దీంతో.. తాను మోసపోయానని లక్ష్మి గ్రహించింది. బస్టాండులో ఏడుస్తూ కూర్చున్న ఆమెను చూసి ఏం జరిగిందని బస్టాండ్‌లోని కొందరు ప్రశ్నించగా.. జరిగిందంతా పూసగుచ్చినట్టు వివరించింది. తప్పు చేశావని.. ఇలా చేయడం కరెక్ట్ కాదని.. లక్ష్మిని మందలించి.. పోలీసులకు ఫిర్యాదు చేయాలని లక్ష్మికి అక్కడి వారు చెప్పారు. లక్ష్మి కామారెడ్డి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
    Published by:Sambasiva Reddy
    First published:

    Tags: Crime news, Extra marital affair, Kamareddy, Telangana crime news

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు