Very Sad: ఘోర పాపం చేసిన తాలిబన్లు.. ఆరు నెలల బాబు తల్లి భుజాలపై ఉండగానే...

ప్రతీకాత్మక చిత్రం

ఆప్ఘనిస్తాన్‌లో తాలిబన్ల పాలన మొదలయ్యాక ‘మేం మారిపోయాం’ అనే మాట మాటున ఆ హింసావాదులు చేస్తున్న ఆగడాలు అన్నీఇన్నీ కావు. ఆప్ఘన్‌ తాలిబన్ల వశమయ్యాక గతంలో మాదిరిగా తమ హక్కులను ఎక్కడ కాలరాస్తారోనన్న భయంతో వందల మంది ఆప్ఘన్ మహిళలు రోడ్డెక్కి ఆందోళనలు చేశారు. హక్కుల కోసం శాంతియుతంగా నినదించారు.

  • Share this:
    కాబూల్: ఆప్ఘనిస్తాన్‌లో(Afghanistan) తాలిబన్ల పాలన మొదలయ్యాక ‘మేం మారిపోయాం’ అనే మాట మాటున ఆ హింసావాదులు చేస్తున్న ఆగడాలు అన్నీఇన్నీ కావు. ఆప్ఘన్‌ తాలిబన్ల వశమయ్యాక గతంలో మాదిరిగా తమ హక్కులను ఎక్కడ కాలరాస్తారోనన్న భయంతో వందల మంది ఆప్ఘన్ మహిళలు రోడ్డెక్కి ఆందోళనలు చేశారు. హక్కుల కోసం శాంతియుతంగా నినదించారు. ఆ సమయంలో మౌనంగా ఉన్న తాలిబన్లు.. తాజాగా పాలన మొదలుపెట్టాక ఆందోళన చేసిన మహిళలను మట్టు పెట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. తమకు ఎవరూ ఎదురు చెప్పకూడదనే నియంత పోకడలో పాలన సాగించే తాలిబన్ల దాష్టికానికి ఓ ముగ్గురు పిల్లల తల్లి బలైపోయింది. ఆ మహిళ పేరు ఫర్వా. దేశాన్ని తాలిబన్లు (Taliban) తమ ఆధీనంలోకి తెచ్చుకున్న తర్వాత ఆందోళన చేసిన మహిళల్లో ఫర్వా ఒకరు. శుక్రవారం ఇంట్లో ఉన్న ఫర్వాకు ఎవరో బయట సాయం కోసం అర్థిస్తున్నట్లు అనిపించింది.

    ఇంట్లోనే ఉండమని, బయటకు వెళ్లొద్దని ఆమె భర్త బతిమాలినప్పటికీ ఆరు నెలల బాబును భుజాలపై ఎత్తుకుని బయటకు వెళ్లింది. మూడేళ్ల బాబు కూడా తల్లిని అనుసరిస్తూ బయటకు వెళ్లాడు. ఫర్వా బయటకు వచ్చి వీధిలోకి అడుగుపెట్టగానే తాలిబన్లు ఆమె చేతిలో చిన్న బాబు ఉన్నాడన్న కనికరం కూడా లేకుండా ఫర్వాను కాల్చి చంపేశారు. దీంతో.. ఫర్వా కుప్ప కూలిపోయింది. అయినప్పటికీ ఆమె చేతిలోని బిడ్డను వదల్దేదు. బిడ్డ భుజాలపై ఉండగానే ఫర్వా కన్నుమూసింది. తల్లి చనిపోయిందన్న విషయం గానీ, ప్రాణం లేని తల్లి దేహంపై పడుకుని ఉన్నాడన్న సంగతి గానీ ఆ ఆరు నెలల బాబుకు తెలియదు.

    తుపాకీతో కాల్చిన శబ్దం వినిపించడంతో ఫర్వాకు ఏమైందోనన్న భయంతో ఆమె భర్త బయటకు వెళ్లి చూడగా ఆమె విగత జీవిగా కనిపించింది. అక్కడే ఉన్న తాలిబన్లన వద్దకు భార్య శవాన్ని తీసుకెళ్లి ఎవరు కాల్చి చంపారని అడగ్గా.. తమకు తెలియదని చెప్పారు. ఎవరో కాల్చేసి ఉంటారని తాలిబన్లు సమాధానమిచ్చారు. ‘వీధుల్లో జరుగుతున్న ఆందోళనల్లోకి నీ భార్య వెళ్లిందా’ అని ఓ తాలిబన్ హుస్సేనీని అడగ్గా.. ‘అందరూ నిరసనల్లో పాల్గొన్నారు కదా’ అని హుస్సేనీ వాళ్లతో చెప్పగా.. ‘సరే.. ఇకపై మళ్లీ ఎప్పుడూ వెళ్లొద్దు’ అని ఓ తాలిబన్ సభ్యుడు సమాధానమిచ్చాడు. భార్యను చంపేసింది తాలిబన్లేనని అప్పుడు హుస్సేనీకి అర్థమైంది. కానీ చేసేదేమీ లేక.. భార్య మృతదేహాన్ని, ఆ బాబును ఆమె భర్త హుస్సేనీ ఇంటికి తీసుకెళ్లాడు.

    ఇది కూడా చదవండి: Newlywed: ఇంటికొచ్చిన కొత్త కోడలు వాకిలి దగ్గర నిల్చుని అదే పనిగా బయటకు చూస్తుంటే అత్తకు ఏం అర్థం కాలేదు.. చివరికి..

    తల్లి వెంట వెళ్లిన మూడేళ్ల బాబు కూడా ‘అమ్మకు ఏమైంది నాన్నా’ అని ఆ కన్నతండ్రిని అమాయకంగా అడిగాడు. అమ్మ నిద్రపోతోందని ఆ పిల్లాడిని హుస్సేనీ సముదాయించాడు. కానీ.. ఆరేళ్ల వయసున్న ఫర్వా పెద్ద కొడుకుకు తన తల్లి చనిపోయిందని అర్థమైంది. అమ్మ కోసం గుండెలవిసేలా రోదించాడు. మరో విషాదకరమైన విషయం ఏంటంటే.. తల్లి శరీరంలోకి దూసుకెళ్లిన తుపాకీ తూటా శబ్దం బాగా దగ్గర నుంచి ఆ ఆరు నెలల బాబు భయంతో గుక్కపట్టి ఏడుస్తున్నాడని, సరిగ్గా తినడం లేదని పిల్లాడి తండ్రి హుస్సేని చెప్పాడు. చాలా దగ్గర నుంచి తుపాకీతో ఫర్వాను కాల్చారని.. ఆ బుల్లెట్ శబ్దం కారణంగా భుజాలపై ఉన్న పిల్లాడు భీతిల్లిపోయాడని.. అప్పటి నుంచి పిల్లాడు వణికిపోతున్నాడని హుస్సేనీ చెప్పాడు.
    Published by:Sambasiva Reddy
    First published: