MARRIED WOMAN BOOKED BY THE POLICE FOR ALLEGEDLY HAVING PHYSICAL RELATIONS WITH HER 17 YEAR OLD LOVER SSR
Married Woman: ఈమె అఫైర్ పెట్టుకున్న వ్యక్తికి వయసెంతో తెలుసా.. అతనితో శారీరకంగా కలిసినందుకు అరెస్ట్
సోనాల్ పాటిల్
అహ్మదాబాద్‌లోని మణినగర్‌లో నివాసం ఉంటున్న సోనాల్ పాటిల్‌కు పెద్దలు టీనేజ్లోనే పెళ్లి చేశారు. ఆమెకు ముగ్గురు పిల్లలు. పాతికేళ్ల లోపు వయసున్న సోనాల్ ఇళ్లల్లో పని చేసుకుంటూ భర్త, పిల్లలతో ఉండేది. అయితే.. గత కొన్ని నెలలుగా సోనాల్‌ను ఆమె భర్త అనుమానిస్తున్నాడు.
అహ్మదాబాద్: 17 ఏళ్ల వయసున్న బాలుడితో ఓ వివాహిత సాగించిన వివాహేతర సంబంధం ఆమెను చిక్కుల్లోకి నెట్టింది. ఆమెపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటన అహ్మదాబాద్‌లోని మణినగర్‌లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. అహ్మదాబాద్‌లోని మణినగర్‌లో నివాసం ఉంటున్న సోనాల్ పాటిల్‌కు పెద్దలు టీనేజ్లోనే పెళ్లి చేశారు. ఆమెకు ముగ్గురు పిల్లలు. పాతికేళ్ల లోపు వయసున్న సోనాల్ ఇళ్లల్లో పని చేసుకుంటూ భర్త, పిల్లలతో ఉండేది. అయితే.. గత కొన్ని నెలలుగా సోనాల్‌ను ఆమె భర్త అనుమానిస్తున్నాడు. ఏ ఇంట్లో ఎవరితో అఫైర్ నడుపుతున్నావో చెప్పాలంటూ ఆమెను వేధించసాగాడు. అలాంటిదేమీ లేదని ఆమె ఎంత చెప్పినా వినకుండా తిడుతూ, కొడుతూ ఆమెను వేధించాడు. భర్త ప్రవర్తనతో సోనాల్ మానసికంగా ఎంతో నలిగిపోయింది. ఈ క్రమంలోనే ఆమెకు ఓ టీనేజ్ బాలుడితో పరిచయం ఏర్పడింది. తన భర్త వేధిస్తున్నాడని, బాధ పెడుతున్నాడని అతనితో చెప్పుకుని బాధపడింది.
అతని నుంచి ఓదార్పు కోరుకున్న సోనాలి పరిచయం కాస్తా ఆ బాలుడితో లైంగిక సంబంధం ఏర్పరచుకునే వరకూ వెళ్లింది. ఇద్దరూ కలిసి కొన్ని నెలలుగా శారీరకంగా కలిశారు. తనకు నచ్చని భర్త నుంచి, ఆ వివాహ బంధం నుంచి దూరమవ్వాలనుకుని ఆ బాలుడితో కలిసి వెళ్లిపోయింది. మహిసాగర్ జిల్లా సంత్రంపూర్కు వెళ్లిపోయి కొన్నాళ్లు అక్కడే ఉన్నారు.
బాలుడి తల్లిదండ్రులు, సోనాలి భర్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఇద్దరినీ వెతికి పట్టుకుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో ఆ బాలుడితో శారీరకంగా కలిసినట్టు సోనాల్ పాటిల్ అంగీకరించిది. దీంతో.. ఆమెపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. ఆమె చేసిన పనిపై ఆమె భర్త తీవ్రంగా స్పందించాడు. తాను అనుమానించేదే చివరకు నిజమైందని చెప్పుకొచ్చాడు.
Published by:Sambasiva Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.