Home /News /crime /

MARRIED WOMAN BEATS LADY BY CUTTING HER HAIR ON SUSPICION OF EXTRAMARITAL AFFAIR IN BIHAR SNR

Viral News : యువతి జుట్టు కత్తిరించి దేహశుద్ధి చేసిన వివాహిత .. అంతకు ముందు ఏం జరిగిందో తెలుసా

(Photo Credit:Youtube)

(Photo Credit:Youtube)

Video Viral: ఆమెకు భర్తపై అనుమానం. పదే పదే ఫోన్‌లో మాట్లాడటంతో నిఘా పెట్టింది. తన భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని తెలుసుకుంది. తన భర్త ప్రియురాలిని ఏం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు.

తన భర్త పదే పదే ఫోన్‌లో మాట్లాడుతున్నాడని అనుమానించింది అతని భార్య. అంతటితో ఆగకుండా ఫోన్‌ నెంబర్‌(Phone number)ని హ్యాక్ చేసి అతను చేస్తున్నది, ఎవరితో మాట్లాడుతున్నది గమనించి తానే స్వయంగా సీన్‌లోకి ఎంటరైంది. భర్తతో తరచుగా మాట్లాడుతున్న మహిళను పట్టుకుంది. తన భర్తతో ఆ మహిళే వివాహేతర సంబంధం(Extramarital affair)పెట్టుకుందనే కోపంతో నలుగురిలో పట్టుకొని ఆమెను చితక బాదింది. అటుపై ఆమె జుట్టు కత్తిరించి తీవ్రంగా అవమానించింది. బీహార్‌ (Bihar)లో జరిగిన ఈసంఘటనను స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియా(Social media)లో పోస్ట్ చేయడంతో రచ్చ రచ్చయింది.

మొగుడిపై అనుమానంతో..
బీహార్‌లో విచిత్రమన కేసుకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గయాలోని టవర్‌ చౌక్‌లో బట్టలషాపు యజమాని రాకేష్‌కుమార్‌కు భార్య సుభద్ర, ఓ కొడుకు ఉన్నారు. మోహన్‌నగర్‌లో నివాసముంటున్నాడు. షాపు టవర్‌చౌక్‌లో పెట్టుకున్నాడు. గత కొద్ది రోజులుగా భర్త తరచూ ఫోన్‌లో ఎక్కువ సేపు మాట్లాడటం, ఇంటికి లేటుగా వస్తుండటంతో భార్యకు అనుమానం వచ్చింది. రాకేష్‌కుమార్‌పై ఓ కన్నేసి ఉంచిన భార్య అతని ఫోన్‌ని ట్రాక్ చేసింది. భర్త పరాయి మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని భావించి బట్టల షాపును టవర్‌ చౌక్ నుంచి మదన్‌పూర్‌కి మార్చింది.

CBSE Exams: స్టూడెంట్స్‌కి దిమ్మతిరిగే న్యూస్.. స్కూల్స్‌కి మతిపోయే వార్త.. సీబీఎస్‌ఈ సిలబస్‌పై పాఠశాలలకు బోర్డు షాక్..!



మహిళకు గుండు చేయించిన వైనం..
అప్పటి కూడా రాకేష్‌కుమార్ సదరు మహిళతో ఫోన్‌లో మాట్లాడటం, కలుస్తున్నట్లుగా తెలుసుకున్న సుభద్ర తన భర్త అతని ప్రియురాలి ఇంట్లో ఉన్న సమయంలో కొడుకు మరికొందరు బంధువులతో వెళ్లి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. బాధితురాలిని జుట్టు కత్తిరించి ఆమెను చితకబాదింది. అడ్డుకోబోయిన భర్తను కూడా పక్కకు నెట్టేసి మహిళకు దేహశుద్ధి చేసి తీవ్రంగా అవమానపరిచింది. ఈ ఫ్యామిలీ రచ్చ కాస్తా కోత్వాలి పోలీస్‌ స్టేషన్‌కు చేరింది. బాధితురాలిని తీసుకొని పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన రాకేష్‌కుమార్ భార్యపైనే ఫిర్యాదు చేశాడు.

Video viral: క్లాస్‌ రూమ్‌లో స్టూడెంట్‌తో మసాజ్ చేయించుకున్న లేడీ టీచర్ ..వీడియో ఇదిగో



వైరల్ అవుతున్న వీడియో..
తన బట్టల షాపుకు తరచుగా వస్తున్న మహిళతో తనకు అక్రమ సంబంధం అంటగట్టిందని..ఆమెను చితకబాది..జుట్టు కత్తిరించిందని భార్య సుబద్రపై కేసు పెట్టాడు. ఈకేసులో మరికొందరి ప్రమేయం ఉందంటూ పోలీసులకు తెలిపాడు. అంతే కాదు తన భార్య తరచూ తనను అనుమానిస్తుందని...ఏ మహిళతో మాట్లాడినా రంకు అంటడగుతుందని వాపోయాడు. చివరకు తన సెల్‌ఫోన్‌ నెంబర్‌ని కూడా హ్యాక్ చేసిందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. పోలీసులు బాధిత మహిళను విచారించారు. ఆమె కూడా ఇదే విధంగా చెప్పడంతో కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మహిళ జుట్టు కత్తిరించడం నేరం కాబట్టి ఆ పని చేసిన ఇద్దరిని అదుపులోకి తీసుకుని కేసు పెట్టినట్లు పోలీసులు తెలిపారు. కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
Published by:Siva Nanduri
First published:

Tags: Bihar, VIRAL NEWS, Viral Video

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు