కొందుర్గుకు చెందిన యువకుడు ఓ అమ్మాయిని ప్రాణంగా ప్రేమించాడు. పెళ్లి చేసుకోవాలని.. తనతోనే జీవితం పంచుకోవాలని కలలు కన్నాడు. కులాలు వేరుకావడంతో ఆమెతో పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదు. ఈ క్రమంలోనే ఆ యువతికి వేరొకరితో వివాహం నిశ్చయమైంది. గురువారం సదరు యువతికి పెళ్లి. ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి తన జీవితంలోకి ఇక రాదన్న మనోవేదనతో పెళ్లికి ఒకరోజు ముందు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ రైల్వే స్టేషన్ వద్ద వెలుగులోకి వచ్చింది. స్థానికుల వివరాల ప్రకారం.. కొందుర్గు మండల కేంద్రానికి చెందిన విజయ్(24) షాద్ నగర్లోని ఓ పరిశ్రమలో పనిచేస్తున్నాడు. బుధవారం పరిశ్రమలో విదులకు వెళ్తున్నట్టు ఇంట్లో చెప్పి బయటికి వెళ్లాడు. రాత్రి అయినా ఇంటికి తిరిగా రాలేదు. గురువారం తెల్లవారుజామున పురుగుల మందు తాగి షాద్ నగర్ రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలపై ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న కాచిగూడ రైల్వే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కుటుంబీకులకు సమాచాం అందించారు. మృతదేహానికి షాద్నగర్ ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం చేశారు. ప్రేమ విఫలంకావడంతోనే విజయ ఆత్మహత్య చేసుకున్నట్టు భావిస్తున్నారు.
Published by:Vijay Bhaskar Harijana
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.