ప్రేమ, పెళ్లి పేరుతో... బాలికను గర్భవతి చేసిన వివాహితుడు

అయితే కొన్నిరోజులుగా బాలిక అనారోగ్యానికి గురికావడంతో అనుమానం వచ్చిన కుటుంబసభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షలు చేయగా బాలిక గర్భవతి అని తేలింది.

news18-telugu
Updated: January 4, 2020, 11:54 AM IST
ప్రేమ, పెళ్లి పేరుతో... బాలికను గర్భవతి చేసిన వివాహితుడు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఆ అమ్మాయి వయసు 17 ఏళ్లు... అతనికి 30 ప్లస్. పెళ్లి కూడా అయ్యింది. అయినా సరే అమ్మాయి వెంట పడ్డాడు. ప్రేమిస్తున్నానన్నాడు. పెళ్లి చేసుకుంటానంటూ నమ్మించాడు. అతడి కల్లబొల్లి మాటల్ని గుడ్డిగా నమ్మింది. అతడికి శారీరకంగా కూడా దగ్గరైంది. ఇంతలో పరిస్థితి చేయి దాటింది. 17 ఏళ్ల వయస్సులోనే ఆ బాలిక గర్భవతి అయ్యింది. దీంతో షాక్ తిన్న కుటుంబసభ్యులు నిలదీయడంతో అసలు విషయం బయటపడింది.

ఈ సంఘటన శంషాబాద్‌లో చోటుచేసుకుంది. శంషాబాద్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శంషాబాద్‌కు చెందిన ఓ బాలిక ఇంటి వద్దే ఉంటోంది. హైదరాబాద్‌కు చెందిన ఓ వివాహితుడు నిత్యం బాలిక తండ్రి వద్దకు వస్తుండేవాడు. అతడి పాడుకన్ను ఆ బాలికపై పడింది. దీంతో ప్రేమిస్తున్నా పెళ్లి చేసుకుందామంటూ బాలికను మభ్యపెట్టాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాలికపై పలుసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే కొన్నిరోజులుగా బాలిక అనారోగ్యానికి గురికావడంతో అనుమానం వచ్చిన కుటుంబసభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షలు చేయగా బాలిక గర్భవతి అని తేలింది.  దీంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు బాలికను నిలదీశారు. అప్పుడే అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో బాలిక కుటుంబ సభ్యుల నిందితుడిపై ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

First published: January 4, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు