‘సహజీవనం చావుకొచ్చింది...’ ప్రేయసిని అతి దారుణంగా చంపి, కాల్చేసిన యువకుడు...

ఓ యువతితో సహజీవనం చేస్తూ భార్యాపిల్లలతో గడపుతున్న వ్యక్తి... విషయం తెలిసి నిలదీసినందుకు ప్రియురాలిని దారుణం కొట్టి, చంపి...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: January 27, 2019, 9:25 PM IST
‘సహజీవనం చావుకొచ్చింది...’ ప్రేయసిని అతి దారుణంగా చంపి, కాల్చేసిన యువకుడు...
నమూనా చిత్రం
  • Share this:
కొన్ని కొన్ని సంఘటనలు విచిత్రంగా అనిపిస్తాయి. ప్రేమకు కళ్లు లేవు, వయసుతో సంబంధం లేదు... అని ఎందరో కవులు రాసేసి వదిలేశారు. వాటిని పట్టుకుని, నేటి జనాలు ఆ మత్తులో మునుగుతున్నారు. నిజమైన ప్రేమ విషయంలో ఇలా అనుకుంటే తప్పు లేదు కానీ శారీరక కోరికలు తీర్చుకునేందుకు ప్రేమ అనే పదాన్ని వాడుకోవడమే నిజమైన ప్రేమికులకు ఇబ్బంది కలిగిస్తోంది. తాజాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఓ సంఘటన అలాంటిదే. బిగనూర్ ప్రాంతంలో ఓ మహిళ మృతదేహాన్ని కాల్చేందుకు ప్రయత్నిస్తున్న 32 ఏళ్ల యువకుడిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఎవరా మహిళ? ఎందుకు హత్య చేశాడు? అనే కోణంలో విచారణ చేయగా అతను చెప్పిన విషయాలు విని, వారికి దిమ్మ తిరిగింది. ఉస్మాన్‌పూర్ ఏరియాలో వడ్రంగి పనులు చేస్తూ జీవిస్తున్న సదరు యువకుడికి పెళ్లై, ఓ మూడేళ్ల కూతురు కూడా ఉంది.

అయితే కొన్నాళ్ల క్రితం అదే ఏరియాలో ఉంటున్న ఓ 28 ఏళ్ల వివాహితతో కార్పెంటర్‌కు పరిచయమైంది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. అంతే భర్తను వదిలేసిన ఆమె, భార్యాపిల్లలను వదిలేసిన అతను ఇద్దరూ కలిసి ఓ గది తీసుకుని సహజీవనం చేయడం మొదలెట్టారు. అయితే ప్రేయసితో సహజీవనం చేస్తున్న సమయంలో కూడా భార్యాపిల్లలను మరిచిపోలేక పోయిన సదరు కార్పెంటర్... మళ్లీ వారి దగ్గరికి వెళ్తుండేవాడు. కొన్నిరోజులు భార్యాపిల్లలతో గడుపుతూ, ఇంకొన్నిరోజులు ప్రేయసితో ఎంజాయ్ చేస్తూ ఉండేవాడు. ఈ విషయం తెలిసిన ప్రియురాలు, అతన్ని నిలదీసింది. దీంతో ఇద్దరి మధ్య తీవ్రమైన వాగ్వాదం జరిగింది. దాంతో తీవ్ర ఆవేశానికి లోనైన కార్పెండర్... జనవరి 22న ఆ యువతిని తీవ్రంగా కొట్టి చంపేశాడు. ఆమె మృతదేహాన్ని ఓ బట్టలో చుట్టి, డ్రైనేజీలో పడేయాలని అనుకున్న అతను... అలా చేస్తూ దొరికిపోయే అవకాశం ఉందని... ఓ కారుని అద్దెకు తీసుకున్నాడు. అందులో ప్రియురాలి శవంతో పాటు బిగనూర్ సమీపంలోని కత్రీయాన్ ఏరియాకు వచ్చాడు. అక్కడ ఎవ్వరూ లేని సమయంలో ఆమె శవాన్ని తగలబెట్టేందుకు ప్రయత్నించాడు. అయితే అతన్ని గుర్తించిన స్థానికులు... పోలీసులకు సమాచారం అందివ్వడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అయితే అతను అద్దెకు తీసుకొచ్చిన కారు మాత్రం పోలీసులకు దొరకలేదు. దాన్ని ఎవరు తీసుకెళ్లారనేది తేలాల్సి ఉంది.


First published: January 27, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>