Telangana Crime: మొదటి భార్యకు విడాకులిచ్చానంటూ.. రెండో పెళ్లి చేసుకున్నాడు.. విషయం తెలుసుకున్న రెండో భార్య..

ప్రతీకాత్మక చిత్రం

Vikarabad: పెళ్లయిన ఆరు నెలలకే వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వికారాబాద్ జిల్లా తాండూరు రూరల్ మండలం చెంగోల్‌ గ్రామంలో చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కరన్‌కోట్‌ ఎస్‌ఐ ఏడుకొండలు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

  • Share this:
    అతడికి అప్పటికే వివాహం జరిగింది. వారిద్దరి మధ్య మనస్పర్థల కారణంగా ఇద్దరు విడిపోయారు. అతడు రెండో పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు. అనుకున్నట్లుగానే పెళ్లికి సంబంధించి అమ్మాయి కోసం వెతికారు. పెళ్లి సంబంధం చూసుకునే సమయంలో అతడికి పెళ్లి అయిందని.. కానీ ఆమెకు విడాకులు కూడా ఇచ్చానని అబద్దం చెప్పి రెండో వివాహం చేసుకున్నాడు. ఆరు నెలల తర్వాత రెండో భార్యకు అసలు విషయం తెలియడంతో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఇలా తరచూ గొడవలు ఎక్కువ అవుతుండటంతో ఓ రోజు రాత్రి ఆమె ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. వికారాబాద్ జిల్లా తాండూరు రూరల్ మండల పరిధిలోని గౌతాపూర్‌కు చెందిన ప్రియాంక (19)కు ఆరు నెలల క్రితం మండలంలోని చెంగోల్‌ గ్రామానికి చెందిన బుడుగజంగం రంగప్పతో వివాహమైంది.

    అయితే రంగప్పకు ఇదివరకే పెళ్లి జరిగింది. ఆమెకు విడాకులు ఇచ్చామని చెప్పి ప్రియాంకను పెళ్లి చేసుకున్నారు. మొదటి భార్యకు సంబంధించి విడాకులు ఇవ్వలేదని రెండో భార్య ప్రియాంకకు తెలిసింది. ఈ విషయమై దంపతులు తరుచూ గొడవ పడుతుండేవారు. ఈ మధ్య మరోసారి గొడవ జరగడంతో ప్రియాంక రాత్రి ఇంట్లో దూలానికి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికులు గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

    Telangana: సాఫీగా సాగిపోతున్న దాంపత్య జీవితంలో.. భర్త, అత్తామామల వేధింపులతో ఆమె చివరకు.. Married commits suicide due to dowry harassment at yadadri district in telangana 
    ప్రతీకాత్మక చిత్రం


    పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహన్ని పోస్టుమార్టమ్‌ నిమిత్తం తాండూరులోని జిల్లా ఆస్పత్రికి తరలించారు. మృతురాలి తండ్రి హన్మంతు ఫిర్యాదు మేరకు ప్రియంక భర్త రంగప్ప, మామ ఆశప్పపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
    Published by:Veera Babu
    First published: