Home /News /crime /

MARRIED MAN AND WOMAN COMMITTED SUICIDE FOR NOT ACCEPTING SECOND MARRIAGE IN WARANGAL DISTRICT AK

రెండో పెళ్లికి ఒప్పుకోలేదని మహిళ ఆత్మహత్య... ప్రియుడితో కలిసి...

రెండో పెళ్లికి ఒప్పుకోలేదని మహిళ, ఆమె ప్రియుడు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన వరంగల్ రూరల్ జిల్లాలో చోటు చేసుకుంది.

రెండో పెళ్లికి ఒప్పుకోలేదని మహిళ, ఆమె ప్రియుడు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన వరంగల్ రూరల్ జిల్లాలో చోటు చేసుకుంది.

రెండో పెళ్లికి ఒప్పుకోలేదని మహిళ, ఆమె ప్రియుడు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన వరంగల్ రూరల్ జిల్లాలో చోటు చేసుకుంది.

    రెండో పెళ్లికి ఒప్పుకోలేదని మహిళ, ఆమె ప్రియుడు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన వరంగల్ రూరల్ జిల్లాలో చోటు చేసుకుంది. నాలుగు రోజుల క్రితం కనిపించకుండా పోయిన ఈ ఇద్దరు... ధర్మారం శివారులోని చెరువుకుంటలో విగత జీవులుగా కనిపించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... వరంగల్‌ అర్బన్‌ జిల్లా కమాలాపూర్‌ మండలం అంబాలకు మంత్రి రమ్య, అదే గ్రామానికి చెందిన గండ్రకోట రాజు పదేళ్ల క్రితం ప్రేమించుకుని ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. అయితే, పెళ్లికి అడ్డంకులు రావడంతో పోలీసులను ఆశ్రయించగా పెద్దల సమక్షంలో కౌన్సెలింగ్‌ ఇచ్చారు.

    అనంతరం రమ్యకు వెలగొండకు చెందిన తిరుపతితో వివాహం జరిపించారు. ఆ తర్వాత కొద్ది కాలానికి రమ్య భర్త ఉపాధి కోసం దుబాయ్‌ వెళ్లగా రమ్య అంబాలలోనే ఇద్దరు పిల్లలతో కలిసి ఉంటోంది. ఇక రాజు వివాహం కూడా జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా చల్వాయికి చెందిన మహిళలతో జరగగా వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే పది నెలల క్రితం రమ్య భర్త అనారోగ్యంతో మృతి చెందాడు. హైదరాబాద్‌లో ఉంటున్న రాజు భార్యాపిల్లలతో కలిసి స్వగ్రామంలో ఇల్లు కట్టుకునేందుకు రావడంతో మళ్లీ రమ్యతో ప్రేమాయణం మొదలైంది.

    వీరి వ్యవహరం కుటుంబసభ్యులకు తెలియడంతో... రాజు భార్యతో పాటు రమ్య కుటుంబీకులు వీరిని మందలించారు. దీంతో నాలుగు రోజుల క్రితం రమ్య, రాజు ఇళ్ల నుంచి వెళ్లిపోయారు. దీనిపై రమ్య కుటుంబీకులు కమలాపూర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ జరుపుతుండగానే ధర్మారం శివారులోని చెరువుకుంటలో వారి మృతదేహాలు చెరువులో తేలూతు కనిపించాయి. సమాచారం అందుకున్న పోలీసులు... మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించి కేసు విచారణ చేపట్టారు.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Crime, Lovers suicide, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు