• HOME
  • »
  • NEWS
  • »
  • CRIME
  • »
  • MARRIED FOR 25 YEARS HUSBAND WHO SENT WIFE AND DAUGHTER OUT OF THE HOUSE ON SUSPICION VB KNR

Telangana: 25 సంవత్సరాల తర్వాత భార్యపై అనుమానం పెంచుకున్న భర్త.. ఆత్మహత్యాయత్నానికి యత్నించిన భార్య.. అసలేం జరిగింది..

Telangana: 25 సంవత్సరాల తర్వాత భార్యపై అనుమానం పెంచుకున్న భర్త.. ఆత్మహత్యాయత్నానికి యత్నించిన భార్య.. అసలేం జరిగింది..

భర్త ఇంటి ఎదుట ధర్నాకు దిగిన భార్య

Karimnagar: అన్యోన్యమైన దాంపత్య జీవితం ఇద్దరు పిల్లలతో హాయిగా బతుకుతున్న కుటుంబంలో ఒక్కసారి అనుమానం పెనుభూతంగా మారింది. కట్టుకున్న భార్యను అనుమానంతో ఇంట్లో నుంచి వెళ్లగొట్టాడు. మనో వేదనకు గురైన ఆమె పురుగు మందు తాగింది.

  • Share this:
    తనకు ఇష్టం లేకుండా ఓ వివాహ వేడుకకు భార్య హాజరైందని అనుమానం పెంచుకున్నాడో భర్త. అంతటితో ఆగకుండా భార్య తో పాటు తన కూతురును కూడా ఇంట్లో నుంచి భయటకు పంపాడు. రెండు సంవత్సరాలైనా ఇంట్లోకి రానివ్వకపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఆమె మహిళా సంఘాలను ఆశ్రయించింది. పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పూర్తి వివరాలు ఇలా.. కరీంనగర్ జిల్లా రురల్ మండలం గోపాల్ పూర్ గ్రామానికి చెందిన  పెందోట వేణుగోపాల్, అనిత భార్య భర్తలు.  వీరికి ఒక బాబు 20 సంవత్సరాలు, కూతురు 18 సంవత్సరాలు ఉన్నారు. వీరు గతంలో జ్యోతినగర్ లొ నివాసం ఉండేవారు. రెండేళ్ల క్రితం వారి బంధువుల పెళ్లికి తన భర్త వద్దన్నా వినకుండా అనిత వెళ్లింది. తన మాటను లెక్క చేయకుండా పెళ్లికి వెళ్లిన భార్య అనితను, తన కూతరును అనుమానంతో ఇంట్లో నుండి వెల్లగొట్టాడు. నీకు దిక్కున్న చోట చెప్పుకో అని చెప్పి ఇంట్లో నుంచి తరిమేశాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

    కౌన్సెలింగ్  ఇచ్చిన మారని తీరు..

    ఆ రోజు నుంచి అనిత తన కూతురు ఇద్దరు చుట్టాల ఇంట్లో, హాస్టల్ లో కాలం వెళ్లదీస్తూ ఉంటున్నట్లు ఆమె తెలిపింది.  ఏదో ఒక రోజు తన భర్త తనను, తన కూతురును ఇంటికి రమ్మనే పిలుపు వస్తుందోనని ఆశతో ఉన్నామన్నారు.  ఒక రోజు పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేయగా వారు బంధువులను పిలిపించి వారి సమక్షంలో కౌన్సెలింగ్ ఇచ్చారు. అయినా అతనిలో ఏ మాత్రం మార్పు రాలేదని అనిత ఆవేదన వ్యక్తం చేసింది. అంతేకాకుండా తన కొడకుతో కూడా తిట్టిస్తున్నట్లు ఆమె తెలిపింది. అయితే ఇటీవల తను ఏ తప్పు చేశానో నిరూపించాలని మహిళా సంఘాలను ఆశ్రయించిన అనిత తన భర్త ఉంటున్న గోపాల్ పూర్ గ్రామానికి వెళ్లింది. అక్కడనే వేణుగోపాల్ ఇంటి ఎదుట ధర్నాకు దిగింది.



    అనితకు న్యాయం చేస్తాం..

    వేణుగోపాల్ విడాకులు కావాలని నోటీసులు పంపాడని ఆమె మనోవేదనకు గురై పురుగు మందు తాగింది. వెంటనే అక్కడున్న మహిళలు హుటా హుటిన ఆమెను ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించి చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.  దర్యాప్తు  అనంతరం అనితకు  న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు..
    Published by:Veera Babu
    First published: