నెల్లూరులో విషాదం.. కుటుంబ కలహాలతో వివాహిత ఇంట్లో ఎవరూ లేని సమయంలో..

భార్య భర్తలు తరచూ ఘర్షణకు పాల్పడే వారని ఆ క్రమంలోనే ఆదివారం ఉదయం భర్తతో వివాదం జరిగినట్లు తెలుస్తోంది. ఘర్షణ అనంతరం భర్త బయటకు వెళ్లడంతో మనస్థాపంతో మేఘన ఉరివేసుకున్నట్లు విచారణలో వెల్లడయ్యింది.

news18-telugu
Updated: June 21, 2020, 6:14 PM IST
నెల్లూరులో విషాదం.. కుటుంబ కలహాలతో వివాహిత ఇంట్లో ఎవరూ లేని సమయంలో..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
నెల్లూరులో విషాదం చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. నెల్లూరు నగరంలోని ఎన్టీఆర్ నగర్ ప్రాంతానికి చెందిన చల్లా మేఘన కొంతకాలంగా తన భర్తతో గొడపడుతోంది. ఈ క్రమంలోనే ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. విషయం తెలుసుకున్న బాలాజీనగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. భర్త ప్రవర్తనతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. భార్య భర్తలు తరచూ ఘర్షణకు పాల్పడే వారని ఆ క్రమంలోనే ఆదివారం ఉదయం భర్తతో వివాదం జరిగినట్లు తెలుస్తోంది. ఘర్షణ అనంతరం భర్త బయటకు వెళ్లడంతో మనస్థాపంతో మేఘన ఉరివేసుకున్నట్లు విచారణలో వెల్లడయ్యింది. ఈ మేరకు బాలాజీనగర్ పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
First published: June 21, 2020, 6:14 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading