వీల్‌ఛైర్ వివాహం... ఆసుపత్రిలో ఒక్కటైన ప్రేమజంట...

ప్రేమించుకున్న బావామరదళ్లు... పెళ్లికి నో చెప్పిన పెద్దలు... మనస్థాపంతో ఆత్మహత్యాయత్నం చేసిన ప్రేమికులు...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: January 11, 2019, 5:58 PM IST
వీల్‌ఛైర్ వివాహం... ఆసుపత్రిలో ఒక్కటైన ప్రేమజంట...
నవాజ్, రేష్మా బేగం
Chinthakindhi.Ramu | news18-telugu
Updated: January 11, 2019, 5:58 PM IST
‘బాబి’ సినిమాలో ఆసుపత్రిలోనే పెళ్లి చేసుకుని, ఒక్కటవుతారు హీరోహీరోయిన్లు మహేష్ బాబు, ఆర్తి అగర్వాల్. సినిమా చూసినప్పుడు కొంత వింతగా, మరికొంచెం కొత్తగా అనిపించినా... అచ్ఛం అలాంటి సంఘటనే తెలంగాణలో జరిగింది. ప్రేమించు పెళ్లిచేసుకుందామనుకున్న ఓ ముస్లిం జంటకు, పెద్దల నుంచి అనుకోని చిక్కులు ఎదురయ్యాయి. ఆ ఇద్దరూ ఒక్కటవ్వడానికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో ఏం చేయాలో తెలియక విషం తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. అయితే వారి ప్రేమకు విషం కూడా విరుగుడుగా పనిచేసింది. ఎట్టకేలకు కష్టాలన్నింటినీ అధిగమించి... ఆసుపత్రిలోనే ఒక్కటయ్యారు ఆ ప్రేమికులు. వికారాబాద్‌లో జరిగిన ఈ సంఘటన స్థానికంగా సంచలనం క్రియేట్ చేసింది. వికారాబాద్ జిల్లా ధారూర్ మండలంలోని కుక్కింద గ్రామానికి చెందిన నవాజ్ అనే 23 ఏళ్ల యువకుడు... బంధువుల అమ్మాయి అయిన 20 ఏళ్ల రేష్మా బేగం ప్రేమించుకున్నారు.

రేష్మా బేగం అక్కను, నవాజ్‌ అన్నకు పెళ్లి జరిగింది. దాంతో వరుసకు బంధువులు కూడా కావడంతో పెద్ద వారి ప్రేమకు అడ్డు చెప్పరని భావించారు. పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నట్టు పెద్దలకు చెప్పారు. అయితే అక్కాచెలెళ్లను ఒకే ఇంటికి ఇవ్వడం మంచిది కాదనే ఉద్దేశంతో పెద్దలు వీరి పెళ్లికి నో చెప్పేశారు. దాంతో తీవ్ర మనస్థాపం చెందిన రేష్మాబేగం... ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. వెంటనే ఆమెను వికారాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. తన కోసం ఆత్మహత్య చేసుకున్న మరదలు... విషం తాగడం చూసి నవాజ్ భరించలేకపోయాడు. ఆసుపత్రిలో ఆమెను చూసేందుకు వెళ్లి, అక్కడే పురుగుల మందు తాగాడు. హఠాత్ పరిణామంతో షాక్‌కు గురైన బంధువులు... వెంటనే అదే ఆసుపత్రిలో అతన్ని చేర్పించారు. ఇద్దరూ మూడు రోజుల పాటు మృత్యువుతో పోరాడి బయటపడ్డారు. దాంతో ఇద్దరికీ ఆసుపత్రిలోనే నిఖా చేశారు వారి కుటుంబసభ్యులు. ఈ పెళ్లిలో ఇద్దరూ వీల్‌ఛైర్ మీదే రావడం విశేషం.

వీడియో చూసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి...



First published: January 11, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు