Marriage: ఆ వరుస ఉన్న వారు వివాహం చేసుకోవడం నేరం.. హై కోర్టు సంచలన తీర్పు

పంజాబ్ కు చెందిన ఓ యువకుడు తన బాబాయి కూతురును ప్రేమించాడు. పెళ్లికి కూడా సిద్ధమయ్యాడు. విషయం కోర్టు వరకు వెళ్లింది. ఈ నేపథ్యంలో న్యాయ స్థానం తీవ్ర వాఖ్యలు చేసింది. ఇద్దరు సోదరుల సంతానం వివాహం చేసుకోవడం చట్ట విరుద్ధమని కోర్టు స్పష్టం చేసింది.

news18-telugu
Updated: November 21, 2020, 5:39 PM IST
Marriage: ఆ వరుస ఉన్న వారు వివాహం చేసుకోవడం నేరం.. హై కోర్టు సంచలన తీర్పు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
సంప్రదాయం ప్రకారం బాబాయి, పెదనాన్న, పిన్ని, పెద్దమ్మ కూతుర్లను వరుసకు సోదరిగా భావిస్తాం. ఈ వరుస అయిన వారిని పురుషులు సాధారణంగా వివాహం చేసుకోవడం. అలా చేసుకోవడం తప్పని భావిస్తుంటారు. అయితే పంజాబ్ కు చెందిన ఓ యువకుడు తన బాబాయి కూతురును ప్రేమించాడు. పెళ్లికి కూడా సిద్ధమయ్యాడు. ఆ యువకుడికి 21 ఏళ్లు కాగా, ఆ యువతికి 17 ఏళ్లు. అయితే ఈ విషయం కుటుంబ సభ్యుల వరకు వెళ్లడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు పలు సెక్షన్ల కింద అతడిపై కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ఆ యువకుడు ముందస్తు బెయిల్ కోసం పంజాబ్ హై కోర్టును ఆశ్రయించాడు.

ఈ నేపథ్యంలో కోర్టు విచారణ చేపట్టింది. ఆ యువతి మైనర్ అని, వీరద్దరు సోదరులకు పుట్టిన సంతానమని ఈ సందర్భంగా ప్రభుత్వ లాయర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో కోర్టు తీవ్ర వాఖ్యలు చేసింది. ఇద్దరు సోదరుల సంతానం వివాహం చేసుకోవడం చట్ట విరుద్ధమని కోర్టు స్పష్టం చేసింది. ఆ అమ్మాయికి 18 ఏళ్లు నిండిన తర్వాత కూడా వివాహం చేసుకోవడం కూడా ఇదే కోవలోకి వస్తుందని తేల్చిచెప్పింది.

ఇదిలా ఉంటే తమకు సెక్యూరిటీ కావాలని ఆ యువతి సైతం పిటీషన్లో పేర్కొంది. తన తల్లిదండ్రులు కుమారులను ప్రేమగా చూసుకుంటూ తనను పట్టించుకోవడం లేదని పిటీషన్లో పేర్కొనడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే తాను ఆ యువకుడితో సన్నిహితంగా ఉంటున్నానని కోట్టుకు తెలిపింది.
Published by: Nikhil Kumar S
First published: November 21, 2020, 5:37 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading