హాజీపూర్ హత్య కేసులో తుది తీర్పు ఫిబ్రవరి 6 వాయిదా...

శ్రీనివాస్‌ రెడ్డి కేసులో ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు విచారణను ముగించింది. ఇరుపక్షాల వాదనలు విన్న నల్లగొండ ఫాస్ట్‌ కోర్టు... ఇవాళ తుది తీర్పును వెలువరిస్తుందని భావించారు. అయితే తీర్పు ప్రతులు వెలువడాల్సి ఉంది. అందుకే ఫిబ్రవరి 6కు తీర్పును వాయిదా వేస్తూ న్యాయస్థానం నిర్ణయం తీసుకుంది.

news18-telugu
Updated: January 27, 2020, 11:39 AM IST
హాజీపూర్ హత్య కేసులో తుది తీర్పు ఫిబ్రవరి 6 వాయిదా...
హాజీపూర్ హత్య కేసులో తుది తీర్పు ఫిబ్రవరి 6 వాయిదా...
  • Share this:
హాజీపూర్ హత్య కేసులో తుది తీర్పు ఫిబ్రవరి 6 వాయిదా పడింది.శ్రావణి, మనీషా, కల్పన ల హత్య కేసుల్లో నిందితుడిగా ఉన్న శ్రీనివాస్‌ రెడ్డి కేసులో ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు విచారణను ముగించింది. ఇరుపక్షాల వాదనలు విన్న నల్లగొండ ఫాస్ట్‌ కోర్టు... ఇవాళ తుది తీర్పును వెలువరిస్తుందని భావించారు. అయితే తీర్పు ప్రతులు వెలువడాల్సి ఉంది. అందుకే ఫిబ్రవరి 6కు తీర్పును వాయిదా వేస్తూ న్యాయస్థానం నిర్ణయం తీసుకుంది. సమత అత్యాచారం కేసులో కూడా ఇవాళే తుది తీర్పు రానుంది. నవంబర్ 24 , 2019న తేదిన లింగాపూర్ మండలం ఎల్లపటార్ శివారులో సమత అత్యాచారం, హత్య జరిగింది. గ్రామాల్లో సంచరిస్తూ బెలూన్లు అమ్ముకుంటూ జీవనం సాగించే బాధితురాలు ఒంటరిగా ఉండటం గమనించి ముగ్గురు వ్యక్తులు అపహరించారు. చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి సామూహిక హత్యాచారం హత్య చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపనలు రేపిన ఈ కేసు విచారణను తీవ్రంగా పరిగణించిన పోలీసులు 20 రోజుల్లోనే దర్యాప్తు పూర్తి చేశారు. డిసెంబర్ 14న ఛార్జ్‌ షీట్‌ దాఖలు చేశారు.

First published: January 27, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు