కానిస్టేబుల్ దారుణ హత్య.. బాణాలతో పొడిచి.. మారణాయుధాలతో నరికి..

సోమరు పోయం(35) అనే వ్యక్తి సహాయ పోలీసు కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. అతడు వైద్య సెలవుపై మత్వాడలోని తన ఇంటికి వెళ్లారు. బుధవారం అర్ధరాత్రి సమయంలో కొంతమంది మావోయిస్టు మిలీషియా సభ్యులు వచ్చి పడుకున్న పోయంను నిద్ర లేపారు.

news18-telugu
Updated: July 3, 2020, 6:49 AM IST
కానిస్టేబుల్ దారుణ హత్య.. బాణాలతో పొడిచి.. మారణాయుధాలతో నరికి..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఇంటిలో నిద్రిస్తున్న ఓ కానిస్టేబుల్‌ను లేపి.. మావోయిస్టులు మారణాయుధాలతో నరికి, బాణాలతో పొడిచి దారుణంగా చంపేశారు. ఈ ఘటన ఛత్తీస్‌గడ్‌లోని బీజాపూర్ జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. జంగ్లా పోలీసు స్టేషన్‌లో సోమరు పోయం(35) అనే వ్యక్తి సహాయ పోలీసు కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. అతడు వైద్య సెలవుపై మత్వాడలోని తన ఇంటికి వెళ్లారు. బుధవారం అర్ధరాత్రి సమయంలో కొంతమంది మావోయిస్టు మిలీషియా సభ్యులు వచ్చి పడుకున్న పోయంను నిద్ర లేపారు. అతడిని బయటకు లాక్కొచ్చి మారణాయుధాలతో నరికి, బాణాలతో పొడిచి అత్యంత కిరాతకంగా హత్య చేశారు. ఈ సమయంలో అతడి కుటుంబ సభ్యులు వచ్చి అడ్డుకున్నా... కనికరించకుండా బెదిరించలేదు.

ఇదిలావుంటే.. ఛత్తీస్‌గడ్ రాష్ట్రంలోని దంతెవాడ జిల్లాలో గురువారం 18 మంది మావోయిస్టులు ఆ జిల్లా కలెక్టర్, ఎస్పీ ఎదుట లొంగిపోయారు. ఆ వివరాలను సీఆర్పీఎఫ్ డీఐజీ అభిషఏక్ పల్లవ్ విలేకరులకు తెలిపారు. సీపీఐ మావోయిస్టు అనుబంధ సంస్థలకు చెందిన మావోయిస్టులు.. తమ వద్ద ఉన్న ఆయుధాలు, తుపాకులను బాన్సీ ఠాణాలో పోలీసులకు అప్పగించి లొంగిపోయారని పేర్కొన్నారు.
First published: July 3, 2020, 6:49 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading