హోమ్ /వార్తలు /క్రైమ్ /

flash news: బంధీలను విడిచిపెట్టేందుకు సిద్ధం.. కొన్ని కండిషన్లు పెట్టిన మావోయిస్టులు?

flash news: బంధీలను విడిచిపెట్టేందుకు సిద్ధం.. కొన్ని కండిషన్లు పెట్టిన మావోయిస్టులు?

మావోలపై ఆంధ్రా పోలీసుల పంజా

మావోలపై ఆంధ్రా పోలీసుల పంజా

మావోయిస్టుల చెరలో ఉన్న జవాన్లను విడిచిపెట్టేందుకు సిద్ధమంటూ లేఖ రిలీజ్ చేశారు. అయితే అలా వారిని విడిచి పెట్టాలి అంటే ఒక కండిషన్ పెట్టారు. ఇంతకీ ఏంటా కండిషన్ అందుకు ప్రభుత్వం ఒప్పుకుంటుందా?

జీరగూడెం ఘటనను మావోయిస్టులు నిర్ధారించారు. తమ దగ్గర బంధీలు క్షేమంగా ఉన్నారని ప్రకటించారు. తాజాగా రెండు పేజీలతో కూడిన లేఖ విడుదల చేసింది మావోయిస్టు కమిటీ.  తాము బంధీలను విడిచిపెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని ఆ లేఖలో ప్రకటించింది. వారికి ఎలాంటి హానీ చేయలేదని లేఖలో పేర్కొంది.

తాము బంధీలను విడిచిపెట్టాలి అంటే.  మద్య వర్తుల పేర్లను ప్రభుత్వం వెల్లడించాలని డిమాండ్ చేశారు. అప్పుడే తాము బంధీలను విడిచిపెడతామని.. అప్పటి వరకు మా జనతన సర్కార్ బంధీలోనే జవాన్లు ఉంటారని లేఖలో స్పష్టం చేశారు.  తమపై 2 వేల మంది పోలీసులు దాడికి తెగబడ్డారని ఆ లేఖలో ఆవేదన  వ్యక్తం చేశారు.

పీఎల్ జీఏను నిర్మూలించేందుకు ప్లాన్ చేశారని మావోయిస్టుల కమిటీ ఆరోపించింది. విజయ్ కుమార్ ఆధ్వర్యంలో 5 రాష్ట్ర్రాల అధికారులు తమపై దాడికి పన్నాగం పన్నారని.. జీరగూడెం దాడిలో నలుగురు మావోయిస్టులు మరణించారని తెలిపారు.

అయితే పోలీసులు తమకు  ఎప్పుడూ శత్రువులు కాదని పేర్కొన్నారు. పాలకవర్గం తెచ్చిన యుద్ధంలో పోలీసులు బలి పశువులు కావడం మంచిది కాదని.. ఈ విషయాన్ని పోలీసులు కూడా గ్రహించి బలిపశువులు కావొద్దని మావోయిస్టుల కమిటీ సలహా ఇచ్చింది.  ప్రజలను, వనరులను ప్రజా సంపదను కాపాడేందుకు ప్రతి దాడి చేయాల్సి వస్తోంది అన్నారు.

ఈ దాడిలో 14  ఆయుధాలు, 2 వేల తూటాలు కొంత సామగ్రిని స్వాధీనం చేసుకున్నామని మావోయిస్టులు లేఖలో స్పష్టం చేశారు. ఈ ఘటనలో చనిపోయిన పోలీసు కుటుంభాలకు ప్రగాడ సంతాపం తెలియజేస్తున్నామన్నారు.  కాగా చత్తీస్ గఢ్లోని బీజాపూర్, సుక్మా అటవీ ప్రాంతంలో మావోయిస్టులతో జరిగిన ఎన్ కౌంటర్ లో 24 మంది జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే.. ఇదే ఘటనలో పలువురు జవాన్లు గల్లంతవ్వగా ఒకరిని మావోలు బంధీగా పట్టుకున్నారు. దీంతో జవాన్ల కుటుంబంతో పాటు, యావత్ భారత ప్రజల్లో ఆందోళన నెలకొంది.

మావోయిస్టులు రాసిన లేఖపై కేంద్రం ఎలా స్పందిస్తుందదో చూడాలి.  ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఆందోళన పెరుగుతోంది. మావోయిస్టుల చెరలో ఉన్న జవాన్లు విడిపించాలని.. వారి కుటుంబ సభ్యులే కాదు యావత్ భారత దేశం డిమాండ్ చేస్తోంది.  కానీ మావోయిస్టులు మాత్రం వారిని వదలాలి అంటే మధ్యవర్తుల పేర్లు చెప్పాలని కండిషన్ పెట్టింది. కానీ ప్రభుత్వం అందుకు సిద్ధంగా ఉండదు. ఇప్పటికే జవాన్లు ఇంతకు ఇంత ప్రతీకారం తీర్చుకుంటామంటున్నారు. అయితే మావోయిస్టులు లేఖలో పేర్కొన్న అంశాలు కూడా ఎంతరకు నిజం అన్నదానిపై  పోలీసుల్లో అనుమానాలు నెలకొన్నాయి. నిజంగా బంధీలను క్షేమంగా ఉంచారా అన్నదానికి రుజువులు కావాలని డిమాండ్ చేస్తున్నారు.

First published:

Tags: Crime, Crime news, Encounter, Naxals

ఉత్తమ కథలు