Home /News /crime /

MAOIST GANAPATHI IS READY TO SURRENDER TO CENTRAL GOVERNMENT SOURCES NK

Maoist Ganapathi: మావోయిస్టు అగ్రనేత గణపతి షాకింగ్ నిర్ణయం

మావోయిస్టు అగ్రనేత గణపతి షాకింగ్ నిర్ణయం (File - credit - twitter)

మావోయిస్టు అగ్రనేత గణపతి షాకింగ్ నిర్ణయం (File - credit - twitter)

Maoist Ganapathi: ఇండియాలో మావోయిస్టుల నాయకుడు గణపతి మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఉన్నారు. ఇప్పుడు ఆయన ఎందుకు షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు? నెక్ట్స్ ఏం జరగబోతోంది?

    మావోయిస్టు పార్టీ అగ్రనేత, మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు గణపతి అలియాస్‌ ముప్పాల లక్ష్మణరావు ప్రభుత్వానికి లొంగిపోబోతున్నట్లు తెలిసింది. దీనిపై ప్రభుత్వంతో చర్చలు జరుగుతున్నట్లు ఇంటెలిజెన్స్‌ వర్గాలు తెలిపాయి. 74 ఏళ్ల గణపతి రెండేళ్ల కిందటే అనారోగ్య కారణాలతో పార్టీ ఉన్నత పదవి నుంచి తప్పుకున్నారు. ఉబ్బసం, మోకాళ్ల నొప్పులు, షుగర్ ఉన్న గణపతిని మోసుకెళ్లి తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉంది. అందుకే ఆయన సాఫీగా లొంగిపోయేలా తెలంగాణ పోలీసులు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం కూడా ఇందుకు సానుకూలంగా ఉంది. సరిహద్దుల్లో చైనా రెచ్చిపోతున్న సమయంలో... గణపతి లొంగిపోవడం ద్వారా... ఇండియాకి మేలు జరుగుతుందని కేంద్రం భావిస్తున్నట్లు తెలిసింది. మావోయిస్టులకు చెక్ పెట్టేందుకు గణపతి లొంగుబాటు ఉపయోగపడుతుందని తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలిసింది.

    గణపతికి భార్య విజయ, కొడుకు వాసుదేవరావు ఉన్నారు. గణపతి... ఓ టీచర్. మావోయిజానికి ఆకర్షితులై అడవిబాట పట్టారు. జగిత్యాల జిల్లాలోని బీర్‌పూర్‌లో ముప్పాల గోపాల్‌రావు-శేషమ్మ దంపతుల రెండో కొడుకైన ఆయన... 1950లో పుట్టారు. 1973లో టీచర్ అయ్యారు. రుద్రంగిలో పని చేశారు. 1975లో బీఈడీ సీటు వచ్చింది. వరంగల్‌ వెళ్లారు. అక్కడ RSUత సంబంధాలు ఏర్పడ్డాయి. 1977లో మేడిపల్లి మండలం గోవిందారంలో బయాలజీ టీచర్‌గా చేరారు. 1977 సెప్టెంబరు 7న ఆదిలాబాద్‌ జిల్లా జన్నారం మండలం తపాల్‌పూర్‌లో పీతాంబర్‌రావు హత్య కేసులో కొండపల్లి సీతారామయ్యతో పాటు గణపతి పేరూ ఉంది. అప్పట్లో 16 మందిపై కేసు నమోదైంది. ఈ కేసు ద్వారా గణపతి... మావోయిస్టు పార్టీలో చేరినట్లు తెలిసింది. 1977లో జగిత్యాల జైత్రయాత్ర కోసం చందాలు వసూలు చేశారనే కేసు, ఉప్పుమడిగె రాజేశ్వర్‌రావు, చిన్నమెట్‌పల్లి జగన్మోహన్‌రావు హత్య కేసులు ఆయనపై నమోదయ్యాయి. ఆ తర్వాత గణపతి... కరీంనగర్‌లో బెయిల్‌ తీసుకుని అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. 1979లో జిల్లా కార్యదర్శి అయ్యారు. 1990-91లో పీపుల్స్‌వార్‌ పార్టీలో చీలికలొచ్చాయి. 2005లో కొత్తగా ఏర్పడిన మావోయిస్టు పార్టీకి గణపతి కేంద్ర కమిటీ కార్యదర్శి అయ్యారు. చాలాకాలం బాధ్యతలు మోశారు. గణపతి తలకు మహారాష్ట్ర ప్రభుత్వం రూ.కోటి ప్రకటించింది. రెండేళ్ల కిందట గణపతి స్థానంలో కేశవరావును కేంద్ర కమిటీ కార్యదర్శిని చేశారు.

    ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం... ఐదేళ్లలో మావోయిస్టుల సమస్యను పరిష్కరించాలని టార్గెట్ పెట్టుకుంది. ఇందుకోసం ముందుగా... శాంతియుత మార్గంలో ముందుకెళ్లాలని నిర్ణయించింది. ఆ ప్రకారమే... ఛత్తీస్‌గఢ్ లాంటి రాష్ట్రాల్లో సమస్య పరిష్కారం కోసం సర్వేలు, అధ్యయనాలూ జరుపుతోంది. ఇలాంటి ప్రయత్నం జరుగుతున్న సమయంలో... గణపతి లొంగిపోతే... అది కేంద్రానికి ఎంతో మేలు కలిగిస్తుంది. మావోయిస్టుల ప్లాన్స్ తెలియడం ద్వారా కేంద్రం మరింత చురుగ్గా ముందుకెళ్లేందుకు వీలవుతుంది. అందువల్ల ఇప్పుడు గణపతి లొంగుబాటు అంశం చర్చకు దారితీసింది.
    Published by:Krishna Kumar N
    First published:

    Tags: Maoists, Telangana News

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు