(జి. శ్రీనివాస్ రెడ్డి, ఖమ్మం జిల్లా, న్యూస్18 తెలుగు)
ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ జిల్లాలో మావోయిస్టులు, పోలీసులకు మధ్య భారీ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. ఈ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు డిప్యూటీ కమాండర్ జోగా హతమయ్యాడు. దర్బా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎలంగనార్ అటవీ ప్రాంతంలో కట్టేకళ్యాణ్-కంగదర్ గట్టీ ఏరియా కమిటీకి చెందిన కొంతమంది మావోయిస్టులు సమావేశం అయినట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తుండగా మావోయిస్టులు తారసపడ్డారు. ఈ క్రమంలో అర్థరాత్రి సమయంలో మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి.
నాలుగు గంటల పాటు ఇవి చోటుచేసుకోగా ఈ ఎదురుకాల్పుల్లో మావోయిస్టు పీఎల్‌జీఏ ప్లాటూన్ నంబరు 26 కట్టే కల్యాణ్ ఏరియా డిప్యూటీ కమాండర్ జోగా (30) ప్రాణాలు కోల్పోయినట్లు ఎస్పీ దీపక్‌ఝూ తెలిపారు. మిగిలిన మావోయిస్టులు తప్పించుకొని పారిపోయారని ఎస్పీ వెల్లడించారు. ఏకె 47, నాటు తుపాకులు, మందుగుండు సామగ్రి, పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Chatisghad, Khammam, Maoist, Maoist attack