దొంగకు మరో దొంగ షాక్.. దొంగతనంలో బిజీగా ఉండగా..

నిజానికి కెల్లీ కూడా స్టోర్‌లో చోరీ చేయడానికే వెళ్లాడు. చోరీ చేసిన వెంటనే పారిపోయేందుకు అనువుగా ట్రక్కు తాళం దానికే వదిలి వెళ్లాడు. అయితే..

news18-telugu
Updated: August 28, 2019, 2:00 PM IST
దొంగకు మరో దొంగ షాక్.. దొంగతనంలో బిజీగా ఉండగా..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కర్మ కాలడం అంటే నిజంగా ఇదేనేమో.. ఓ దొంగ దొంగతనంలో బిజీగా ఉండగా.. అతని కారును మరో దొంగ చోరీ చేశాడు.దీంతో సదరు దొంగకు గట్టి షాక్ తగిలినట్టయింది. అమెరికాలోని వాషింగ్టన్‌లో ఈ ఘటన జరగ్గా.. దానికి సంబంధించిన సీసీటీవి ఫుటేజీ వైరల్‌గా మారింది.ఆదివారం సాయంత్రం 6గంటలకు ఈ ఘటన జరిగినట్టు సమాచారం.

వివరాల్లోకి వెళ్తే... కెల్లీ అనే ఓ వ్యక్తి వాషింగ్టన్‌లోని ఓ వీధిలో ఉన్న స్టోర్ ఎదుట తన ట్రక్కు నిలిపి.. స్టోర్ లోపలకు వెళ్లాడు. అయితే కొద్దిసేపటికి అతని ట్రక్కును ఎవరో వ్యక్తి చోరీ చేయడం గమనించి.. పరిగెత్తుకొంటూ బయటకొచ్చాడు. ఆపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. స్టోర్ లోపలకు వెళ్లే హడావుడిలో ట్రక్కు తాళం దానికే వదిలేసి లోపలికి వెళ్లానని చెప్పాడు. నిందితుడిని గుర్తించేందుకు పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా.. అసలు విషయం బయటపడింది.నిజానికి కెల్లీ కూడా స్టోర్‌లో చోరీ చేయడానికే వెళ్లాడు. చోరీ చేసిన వెంటనే పారిపోయేందుకు అనువుగా ట్రక్కు తాళం దానికే వదిలి వెళ్లాడు. అయితే ఆ సమయంలో అటుగా వెళ్తున్న ఓ దొంగకు ట్రక్కు కనిపించడం.. తాళం కూడా దానికే ఉండటంతో అదృష్టం కలిసొచ్చింది అనుకున్నాడు.

వెంటనే తన బైక్‌ను ట్రక్కులో ఎక్కించి.. ట్రక్కు స్టార్ట్ చేసి అక్కడినుంచి ఉడాయించాడు. ట్రక్కు సౌండ్ వినిపించడంతో కెల్లీ స్టోర్ నుంచి బయటకు పరిగెత్తుకొచ్చాడు. ఆ తర్వాత ఓ కట్టుకథ అల్లి పోలీసులకు చెప్పాడు. సీసీటీవి ఫుటేజీలో అసలు విషయం బయటపడటంతో పోలీసులు కెల్లీని అరెస్ట్ చేశారు. మొత్తం మీద దొంగతనానికి వెళ్తే.. మరో దొంగ చేసిన పనికి కెల్లీ అడ్డంగా బుక్కయ్యాడన్నమాట.

First published: August 28, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు