Home /News /crime /

MANIPUR POLL VIOLENCE FIRING STONE PELTING CONGRESS BJP CLASH MARS FIRST PHASE OF VOTING MKS

Manipur poll violence: మణిపూర్ తొలివిడత పోలింగ్ రక్తసిక్తం.. కాల్పులు, రాళ్లదాడులు

ధ్వంసమైన పోల్ సామాగ్రి

ధ్వంసమైన పోల్ సామాగ్రి

యూపీలో ఐదు దశలు, ఉత్తరాఖండ్, గోవా, పంజాబ్ లోనూ పోలింగ్ దాదాపు ప్రశాంతంగా సాగగా, అనూహ్యంగా ఈశాన్య రాష్ట్రం మణిపూర్ లో ఎన్నికల హింస చెలరేగింది. మణిపూర్ తొలి దశ పోలింగ్ పర్వంలో హింసాకాండ జరిగింది.

అతిపెద్దదైన ఉత్తరప్రదేశ్ సహా ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో ఇన్నాళ్ల ప్రశాంతతకు భంగం వాటిల్లింది. యూపీలో ఐదు దశలు, ఉత్తరాఖండ్, గోవా, పంజాబ్ లోనూ పోలింగ్ దాదాపు ప్రశాంతంగా సాగగా, అనూహ్యంగా ఈశాన్య రాష్ట్రం మణిపూర్ లో ఎన్నికల హింస చెలరేగింది. మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశలో భాగంగా సోమవారం నాటి పోలింగ్ పర్వంలో హింసాకాండ జరిగింది.పోలింగ్ ప్రారంభమైన కొన్ని గంటల తర్వాత మణిపూర్‌లోని కీరావ్ నియోజకవర్గంలో రెండువర్గాలు రాళ్ల దాడికి దిగడంతో పోలీసులు కాల్పులు జరిపారు.

పోలింగ్ బూత్ కబ్జా చేశారంటూ పరస్పర ఆరోపణలపై కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. రాళ్లు రువ్వుకున్నారు. దీంతో కాంగ్‌పోక్పి జిల్లాలోని న్యూ కెయిథెల్‌మన్బి నియోజకవర్గంలో కూడా పోలింగ్‌కు అంతరాయం ఏర్పడింది.చురాచంద్‌పూర్‌లోని సింఘత్ అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా మాక్ పోల్ పరీక్షలో బీజేపీ కెపిఎ పక్షాల మధ్య ఘర్షణ చెలరేగడంతో హింస చెలరేగింది. ఈ ఘర్షణలో ఈవీఎం కంట్రోల్ యూనిట్ పాడైంది. రిటర్నింగ్ అధికారి బ్యాకప్ ఈవీఎం కోసం కాల్ చేశారు.

Actress Srabanti: ప్రముఖ హీరోయిన్‌పై కేసు నమోదు.. అలా చేయడం తప్పని తెలీదట!


న్యూ కెయిథెల్‌మన్‌బిలో బీజేపీ కార్యకర్తలు బూత్‌ను స్వాధీనం చేసుకున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. దీంతో కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు ఘర్షణ పడ్డారు.ఘర్షణలో పాల్గొన్న జనాన్ని చెదరగొట్టేందుకు భద్రతా బలగాలు కాల్పులు జరపాల్సి వచ్చింది.ఘర్షణ జరగ్గా పోలీసులు నియంత్రించారని ఎన్నికల సంఘం అధికారులు చెప్పారు.‘‘మణిపూర్‌లో ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 11:30 గంటలకు మొత్తం 27.3శాతం ఓటింగ్ నమోదైంది.’’అని ఈసీ అధికారులు చెప్పారు.
Published by:Madhu Kota
First published:

Tags: Assembly Election 2022, Manipur, Manipur Assembly elections 2022

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు