పైసలు దొంగతనం చేసిందని.. ఓ మహిళపై మరో మహిళ రేప్..

ఇంట్లో దాచిపెట్టిన డబ్బులు దొంగతనం చేసిందన్న కారణంతో ఓ యువతిపై మరో యువతి దారుణానికి పాల్పడింది. దాదాపు రూ.12వేలు చోరీ చేసిందని యువతిని చిత్రవధ చేసి ఆమెపై అత్యాచారానికి పాల్పడింది.

news18-telugu
Updated: October 4, 2019, 8:06 AM IST
పైసలు దొంగతనం చేసిందని.. ఓ మహిళపై మరో మహిళ రేప్..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఇంట్లో దాచిపెట్టిన డబ్బులు దొంగతనం చేసిందన్న కారణంతో ఓ యువతిపై మరో యువతి దారుణానికి పాల్పడింది. దాదాపు రూ.12వేలు చోరీ చేసిందని యువతిని చిత్రవధ చేసి ఆమెపై అత్యాచారానికి పాల్పడింది. ఈ దారుణ అమెరికాలోని ఓక్లాహోమాలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. లారా పల్మార్(35) అనే మహిళ తన డబ్బులను ఇంట్లో దాచిపెట్టింది. అయితే, ఆ డబ్బులను మరో మహిళ దొంగతనం చేసి ఉంటుందని ఆమెను బంధించి, తన ఇద్దరు స్నేహితులను ఇంటికి పిలిపించింది. వారితో ఆమె ఒంటిపై ఉన్న దుస్తులు విప్పించింది. అంతేకాదు.. వారిద్దరితో ఆమెపై రేప్ చేయించింది కూడా. ఆ తర్వాత బాధితురాలిని బాత్రూంకు తీసుకెళ్లి, డ్రిల్లింగ్ బిట్‌ను ఆమె చంకలో చొప్పించి గాయపర్చింది. గాయాలైన చోట యాసిడ్ పోసి రాక్షసానందం పొందింది. అనంతరం తన వద్ద తుపాకితో బెదిరించి అత్యాచారం చేసింది.

బాధితురాలు ఎలాగోలా ఆమె నుంచి తప్పించుకొని పోలీసుల సహాయం కోరింది. వాళ్లు ఘటనా స్థలికి వచ్చేలోగా నిందితురాలు పరారయ్యింది. పోలీసులు పల్మార్‌పై ఫస్ట్ డిగ్రీ రేప్ కింద కేసు నమోదు చేశారు. పల్మార్ అపార్టుమెంట్‌లో తుపాకి, డ్రిల్ బిట్‌ను స్వాధీనం చేసుకున్నారు.
First published: October 4, 2019, 8:06 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading