Home /News /crime /

MANCHU VISHNU LATEST UPDATES THEFT AT MAA PRESIDENT MANCHU VISHNU OFFICE POLICE FILES A CASE MKS

Vishnu Manchu: మా అధ్యక్షుడు మంచు విష్ణు ఆఫీసులో చోరీ.. ఏం ఎత్తుకెళ్లారో తెలిస్తే అవాక్కే!

మా అధ్యక్షుడు మంచు విష్ణు

మా అధ్యక్షుడు మంచు విష్ణు

మంచు కుటుంబానికి సంబంధించి మరో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. మూవీ ఆర్ట్సిస్ట్స్ అసోయేషన్(మా) అధ్యక్షుడు మంచు విష్ణుకు దొంగలు ఝలకిచ్చారు. ఫిలింనగర్ లో ఉన్న మా ఆఫీసులో దుండగులు చోరీకి పాల్పడ్డారు.

తెలుగు సినీ పరిశ్రమలో పెద్దలుగా కొనసాగుతోన్న మంచు కుటుంబానికి సంబంధించి మరో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. మూవీ ఆర్ట్సిస్ట్స్ అసోయేషన్(మా) అధ్యక్షుడు మంచు విష్ణుకు దొంగలు ఝలకిచ్చారు. ఫిలింనగర్ లో ఉన్న మా ఆఫీసులో, ప్రెసిడెంట్ విష్ణు ఛాంబర్ లో గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. మా అధ్యక్షుడి ఆఫీసులో చోరీపై విష్ణు మేనేజర్ సంజయ్ జూబ్లీ హిల్స్ పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేశారు.

మంచు విష్ణు మా ఆఫీసులో చోరీపై ఆయన మేనేజర్ సంజయ్ స్వయంగా పోలీసులుకు ఫిర్యాదు చేయడంతోనే ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. దొంగలు.. మంచు విష్ణు ఆఫీసులో హెయిర్ డ్రెస్సింగ్ సామాగ్రిని ఎత్తుకెళ్లారు. దుండగులు అపహరించిన హెయిర్ డ్రెస్సింగ్ సామాగ్రి విలువ సుమారు రూ. 5లక్షల ఉంటుందని అంచనా. కాగా,

PM Modi: కొందరు నా చావును కోరుకుంటున్నారు.. అందుకు సంతోషం: కాశీలో మోదీ


మా ప్రెసిడెంట్ మంచు విష్ణు ఆఫీసులో హెయిర్ డ్రెస్సింగ్ సామాగ్రి చోరీకి సంబంధించి నాగ శ్రీను అనే వ్యక్తిపై అనుమానం ఉన్నట్లు మేనేజర్ సంజయ్ ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఇండస్ట్రీలో హెయిర్ డ్రెస్సర్ గా పనిచేసుకునే నాగ శ్రీను.. విష్ణు ఆఫీసులో చోరీ జరిగినప్పటినుంచి కనిపించకుండా పోయాడని, బహుశా అతనే వస్తువులను దొంగిలించి ఉండొచ్చని సంజయ్ అనుమానం వ్యక్తం చేశారు.

Russia Ukraine War: అణు బాంబులు సిద్దం చేయండి: శాంతి చర్చల వేళ పుతిన్ షాకింగ్ ఆదేశాలు


మంచు విష్ణు మేనేజర్ సంజయ్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వరుస వివాదాలు, సినిమా వైఫల్యాలకు తోడు ఇప్పుడు చోరీ ఘటన కూడా మంచు కుటుంబాన్ని కలవరపెట్టినట్లయింది. ఆఫీసులో చోరీ విషయమై విష్ణు నేరుగా స్పందించాల్సి ఉంది.
Published by:Madhu Kota
First published:

Tags: Hyderabad police, MAA President, Manchu vishu, Tollywood

తదుపరి వార్తలు