‘న్యాయం చేయండి, కానీ...’ దిశ హంతకుల ఎన్‌కౌంటర్‌పై మంచు లక్ష్మి

దిశ హంతకుల ఎన్‌కౌంటర్‌ను ఆధారంగా తీసుకుని నిజమైన మార్పు తీసుకురావాలని మంచులక్ష్మి ఆకాంక్షించారు.

news18-telugu
Updated: December 6, 2019, 4:40 PM IST
‘న్యాయం చేయండి, కానీ...’ దిశ హంతకుల ఎన్‌కౌంటర్‌పై మంచు లక్ష్మి
మంచు లక్ష్మి ఫైల్ ఫోటో(Image:Facebook)
  • Share this:
దిశ హంతకుల ఎన్‌కౌంటర్ మీద మంచు లక్ష్మి స్పందించారు. ఎన్‌కౌంటర్ విషయం తెలిసిన వెంటనే దిశకు న్యాయం జరిగిందని భావించానని చెప్పారు. అయితే, ఎంతమందిని ఎన్‌కౌంటర్ చేస్తారని మంచులక్ష్మి ప్రశ్నించారు. న్యాయవ్యవస్థను నమ్ముకుని, ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసుకున్నామని మంచులక్ష్మి చెప్పారు. ఎన్‌కౌంటర్ చూసిన తర్వాత ఆ నలుగురు అబ్బాయిల తల్లిదండ్రులు ఎంత కుమిలిపోయి ఉంటారో ఆలోచించాలని చెప్పారు. ఎన్‌కౌంటర్ తర్వాత సెలబ్రేషన్స్ చూసి తనకు భయమేసిందన్నారు. ‘దిశ హంతకుల ఎన్‌కౌంటర్ తర్వాత ప్రజల సంబరాలు చూసి భయపడ్డా. ప్రతిసారీ ఇలాంటి ఎన్‌కౌంటర్లు జరగవు. మనలో మార్పు రావాలి. మన చట్టాలు బలోపేతం చేయాలి. పెద్దవాళ్ల పిల్లలైతే ఇలాగే చంపుతారా? అని కొందరు అడుగుతున్నారు.’ అని మంచులక్ష్మి అన్నారు.

దిశ హంతకుల ఎన్‌కౌంటర్‌ను ఆధారంగా తీసుకుని నిజమైన మార్పు తీసుకురావాలని మంచులక్ష్మి ఆకాంక్షించారు. దీనిపై ఏవైనా పిటిషన్లపై సంతకాలు చేయాలన్నా, బాధితులకు సత్వర న్యాయం జరిగేలా తీసుకునే చర్యలకు మద్దతు కావాలంటే తాను, తనతోపాటు కొన్ని లక్షల మంది మహిళలను సమీకరిస్తానని చెప్పారు. పోలీసులు న్యాయం చేయాలి కానీ, మీ చేతుల్లోకి తీసుకోవద్దని మంచులక్ష్మి విజ్ఞప్తి చేశారు.

First published: December 6, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>