190 మంది మగాళ్లపై అత్యాచారం... వీడియోలు భద్రంగా దాచుకున్న యువకుడు...

ఆ రోజు ఓ యువకుడికి కూడా ఇలాగే తన ఇంట్లో ఉండేందుకు షెల్టర్ ఇచ్చాడు. అతడికి కూడా డ్రింక్‌లో మత్తుమందు కలిపి ఇచ్చాడు. అతడితో శృంగారం జరుపుతున్న మధ్యలోనే యువకుడికి మెలకువ వచ్చింది.

news18-telugu
Updated: January 8, 2020, 6:52 PM IST
190 మంది మగాళ్లపై అత్యాచారం... వీడియోలు భద్రంగా దాచుకున్న యువకుడు...
నమూనా చిత్రం
  • Share this:
ఓ యువకుడు ఒకరు కాదు, ఇద్దరు కాదు. ఏకంగా 190 మంది మగాళ్ల మీద అత్యాచారం చేశాడు. వారందరినీ రేప్ చేస్తున్న వీడియోలు కూడా తీసుకుని భద్రంగా తన మొబైల్ ఫోన్‌లో దాచుకున్నాడు. బ్రిటన్‌లోని మాంచెస్టర్‌లో ఈ ఘోరం వెలుగులోకి వచ్చింది. ఇండొనేసియాకు చెందిన ఓ యువకుడు 2007 సంవత్సరంలో చదువు కోసం బ్రిటన్ వలస వచ్చాడు. అయితే, అతడు తన శారీరక వాంఛ తీర్చుకోవడానికి ఓ ప్లాన్ వేశాడు. మాంచెస్టర్ క్లబ్‌ను అందుకు వాడుకున్నాడు. మాంచెస్టర్ క్లబ్‌లో ఫుల్లుగా తాగి ఇంటికి సరిగా వెళ్లలేని వారిని తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. వారికి తన ఇంట్లో ఉండేందుకు అవకాశం ఇస్తానని తీసుకెళ్లేవాడు. అనంతరం తన ఇంటికి వెళ్లిన తర్వాత వారికి మత్తుమందు కలిపిన డ్రింక్ ఇచ్చేవాడు. ఆ తర్వాత వారి మీద పడి తన శరీర వాంఛ తీర్చుకునేవాడు.

ఆ రోజు ఓ యువకుడికి కూడా ఇలాగే తన ఇంట్లో ఉండేందుకు షెల్టర్ ఇచ్చాడు. అతడికి కూడా డ్రింక్‌లో మత్తుమందు కలిపి ఇచ్చాడు. అతడితో శృంగారం జరుపుతున్న మధ్యలోనే యువకుడికి మెలకువ వచ్చింది. తన మీద జరుగుతున్న అత్యాచారాన్ని చూసి భయపడిన యువకుడు అక్కడి నుంచి పారిపోయాడు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

పోలీసులు రంగంలోకి దిగి నిందితుడిని పట్టుకున్నారు. అనంతరం అతడి వద్ద ఉన్న సెల్ ఫోన్‌ను పరిశీలించగా, అందులో 190 మంది మీద అతడు అత్యాచారం జరుపుతున్న వీడియోలు ఉన్నాయి. వారందరినీ గుర్తుపట్టడం కూడా పోలీసులకు సవాల్‌గా మారింది. ఈ క్రమంలో పోలీసులు ప్రజల సమాచారాన్ని తెలుసుకుని వారిని పోలీస్ స్టేషన్‌కు పిలిపించారు. అయితే, తమ మీద అత్యాచారం జరిగినట్టు వారు ఎవరికీ తెలియకపోవడం గమనార్హం. అందులో 70 మంది వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని పోలీసులు చెబుతున్నారు. ఈ కేసులో నిందితుడికి కోర్టు యావజ్జీవ శిక్ష విధించింది.

First published: January 8, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు