How to kill a Baby అంటూ ఫోన్‌లో సెర్చ్.. కట్ చేస్తే సీన్ మారిపోయింది.. ఇలా కూడా జరుగుతుందా ?

ప్రతీకాత్మక చిత్రం

బ్రిటన్‌లోని జామర్ బెయిలీ అనే వ్యక్తి ఓ మూడు వారాల చిన్నారిని చంపేందుకు ప్లాన్ చేశాడు. ఇందుకోసం ఆమె తాగే పాలల్లో విషం లాంటి పదార్ధాన్ని కలిపాడు.

  • Share this:
    కొందరు నేరస్థులు నేరం చేయడానికి ముందు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. తమ నేరం బయటపడకుండా ఉండేందుకు ఎన్ని చేయాలో.. అన్నీ చేస్తుంటారు. కానీ ఏదో ఒక చోట వారి నేరానికి సంబంధించిన సాక్ష్యం బయటపడుతుంది. బ్రిటన్‌లోని జామర్ బెయిలీ అనే వ్యక్తి ఓ మూడు వారాల చిన్నారిని చంపేందుకు ప్లాన్ చేశాడు. ఇందుకోసం ఆమె తాగే పాలల్లో విషం లాంటి పదార్ధాన్ని కలిపాడు. దీంతో ఆ చిన్నారి ఆస్పత్రి పాలైంది. జూన్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆమెకు చికిత్స అందించిన వైద్యులు.. ఆ విషం చిన్నారి ఏ రకంగానూ తీసుకోవడానికి అవకాశం లేదని గ్రహించారు. ఎవరో కావాలనే చిన్నారికి ఈ డ్రగ్ ఇచ్చారని నిర్ధారణకు వచ్చారు. ఈ డ్రగ్ ఎట్టి పరిస్థితుల్లోనూ చిన్నారులకు ఇవ్వకూడదనే విషయం తెలుసుకున్న వాళ్లే ఇలా చేశారని గుర్తించారు.

    ఇదే విషయాన్ని పోలీసులకు తెలిపారు. దీంతో చిన్నారిని చంపడానికే ఎవరో ఇలా చేశారని పోలీసులు అనుమానించారు. ఈ క్రమంలోనే బెయిలీపై వారికి అనుమానం వచ్చింది. అతడిని విచారించారు పోలీసులు. అయితే తాను చిన్నారికి ఆ డ్రగ్ ఇవ్వలేదని బుకాయించాడు బెయిలీ. అసలు ఈ కేసుతో తనకేంటి సంబంధం అని ప్రశ్నించాడు. అనవసరంగా తనను ఇబ్బందిపెట్టొద్దని వారికి సూచించాడు. దీంతో ఈ విషయంలో అతడి పాత్ర లేదేమో అని పోలీసులు కూడా భావించారు. పోలీసులకు కూడా ఇందుకు సంబంధించి ఎలాంటి సాక్ష్యం లభించలేదు. దీంతో తాను ఈ కేసు నుంచి బయటపడినట్టే అని భావించాడు బెయిలీ.

    Etela Rajendar: పిచ్చి పట్టిందా హరీశ్ ?.. దానితో నాకేం సంబంధం.. మండిపడ్డ ఈటల రాజేందర్

    Revanth Reddy ముందస్తు వ్యూహం.. KCR ప్లాన్‌కు కౌంటర్.. Congress హైకమాండ్ ఓకే చెబుతుందా ?

    కానీ కేసును ఎలాగైనా చేధించాలని భావించిన పోలీసులు.. మరింత లోతుగా విచారణ చేపట్టారు. కానీ పోలీసులకు ఊహించని విధంగా అతడు నేరం చేసినట్టు నిరూపించే ఓ సాక్ష్యం లభించింది. అదే అతడి సెల్‌ఫోన్. అతడి సెల్‌ఫోన్‌లోని గూగుల్ సెర్చ్‌లో How to kill a baby అనే అంశంపై బెయిలీ కొన్నిసార్లు సెర్చ్ చేశాడు. ఇందుకు సంబంధించి హిస్టరీని పోలీసులు గుర్తించారు. దీని ఆధారంగా అతడే నిందితుడని నిర్ధారించారు. కోర్టు బెయిలీకి 25 ఏళ్ల జైలుశిక్ష విధించింది. అయితే ఆ చిన్నారిపై బెయిలీ కోపం పెంచుకున్నాడనే విషయాన్ని మాత్రం పోలీసులు కనిపెట్టలేకపోయారు. ఇక బెయిలీ ఇచ్చిన డ్రగ్‌తో ఆస్పత్రి పాలైన చిన్నారి.. కొన్ని నెలల తరువాత మళ్లీ క్షేమంగా ఇంటికి చేరుకుంది.
    Published by:Kishore Akkaladevi
    First published: