కేరళలోని.. కోజికోడ్‌లో పోలీసులు ఓ యువకుణ్ని అదుపులోకి తీసుకున్నారు. అతను ఓ యువతి మొబైల్ కొట్టేశాడు. ఆ తర్వాత పెద్ద ప్లాన్ వేశాడు. మార్ఫింగ్ ఫొటోలతో ఆమెను బెదిరించాడు. చివరకు పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. అతని పేరు చెరియాదన్ మన్సూర్. వయసు 36 ఏళ్లు. నీలాంబర్ ఎడక్కరకు చెందినవాడు. పనీపాటా లేకుండా తిరుగుతున్నాడు. అతను పెరుమన్నకు చెందిన యువతి ఫోన్ కొట్టేశాడు.
మన్సూర్ కోసం పోలీసులు కొంతకాలంగా గాలిస్తున్నారు. తాజాగా మంగళవారం మధ్యాహ్నం.. మన్సూర్.. ఎర్నాకుళం నార్త్ రైల్వే స్టేషన్ దగ్గర ఎవర్ని ముంచుదామా అని ఎదురుచూస్తున్న మన్సూర్‌ని పట్టుకొని.. పార్వతి దొరికింది అన్నారు. చుట్టుపక్కల ఉన్నవారు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే.. అరెస్టు చేసింది యువకుణ్ని. మరి పార్వతి ఏంటి అనేది వారి డౌట్. అది ఈ కథలో మరో ట్విస్ట్.
యువకుడి బెదిరింపులపై బాధితురాలుయయ చెర్పులస్సెరీ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. దర్యాప్తు చేసిన పోలీసులకు కొత్త విషయం తెలిసింది. మన్సూర్.. ఫేస్బుక్లో పార్వతి అనే నకిలీ అకౌంట్ ఉంది. ఆ అకౌంట్ ద్వారా.. బాధితురాలికి మెసేజ్‌లు పంపి బెదిరిస్తున్నాడు. తనకు రూ.4.5 లక్షలు ఇవ్వకపోతే.. అంతపని చేస్తానని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు.
ఇదంతా ఎలా జరిగింది?
ఆగస్టులో బాధిత మహిళ, ఆమె కూతురూ.. పంతిరంగావ్లో ప్రయాణిస్తూ ఉండగా.. ఎక్కడో మొబైల్ పోయింది. దాని కోసం ఎంత వెతికినా దొరకలేదు. ఆ ఫోన్ కొట్టేసిన మన్సూర్.. ఇంటికి తీసుకెళ్లి.. అందులోని మహిళ ఫొటోలను నగ్నంగా మార్ఫింగ్ చేశాడు. తర్వాత ఆమె ఫేస్బుక్ అకౌంట్ ఏదో తెలుసుకున్నాడు. తర్వాత పార్వతీ పేరుతో నకిలీ ఫేస్బుక్ అకౌంట్ తెరిచాడు. దాని ద్వారా ఆ మహిళకు నగ్న ఫొటోలు పంపాడు. తనకు రూ.4.5 లక్షలు ఇవ్వకపోతే.. నగ్న ఫొటోలను.. మొబైల్లోని ఆమె వాట్సాప్ ఫ్రెండ్స్‌కి పంపుతానని బెదిరించాడు.
బాధితురాలు ధైర్యం చేయడంతో అతని ఆటలు సాగలేదు. ఐతే.. మన్సూర్ ఇలాంటివి చాలా చేశాడు. చుట్టుపక్కల కొన్ని పోలీస్ స్టేషన్లలో అతనిపై కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. అసలు ఇలాంటి వాళ్లను బయట తిరగనివ్వడమే తప్పని స్థానికులు అంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news