Home /News /crime /

MAN WHO KILLED BOSS FAMILY IN US OVER FAILED JOB PROMOTION ARRESTED AFTER 8 YEARS PAH

అమ్మబాబోయ్.. 8 ఏళ్ల తర్వాత వెలుగులోనికి దారుణం.. ఆఫీస్ లో గొడవ.. బాస్ ఇంటికి వెళ్లి ఏంచేశాడంటే..

నిందితుడు ఫాంగ్ లు (ఫైల్)

నిందితుడు ఫాంగ్ లు (ఫైల్)

Viral news: కంపెనీలో పనిచేసే ఉద్యోగి తన బాస్ పై కోపంతో రగిలిపోయాడు. అందరితో పాటు తనకు ఉద్యోగంలో ప్రమోషన్ దొరుకుందని భావించాడు.

  • News18 Telugu
  • Last Updated :
  • Goa, India
కొందరు తమ ఉద్యోగాన్ని ఛాలెంజింగ్ గా తీసుకుంటారు. ఎన్ని కష్టాలు వచ్చిన.. అవన్ని దాటుకుంటూ వెళ్లిపోతారు. వర్క్ విషయంలో తమ ట్యాలెంట్ చూపిస్తారు. అందరిలో మంచి పేరు, గుర్తింపు రావాలని భావిస్తుంటారు. అయతే.. కొన్ని చోట్ల బాస్ లు భిన్నంగా ఉంటారు. కిందస్థాయి ఉద్యోగులు అంతగా ఎలివేట్ కాకుండా తొక్కిపెడుతుంటారు. తమ కింది ఉద్యోగులను వేధిస్తు, ఇబ్బందులకు గురిచేస్తుంటారు. దీంతో సదరు వ్యక్తులు పనిచేసే చోట ఒత్తిడికి గురై ఇష్టమోచ్చినట్లు ప్రవర్తిస్తుంటారు. కొన్ని సార్లు ఆఫీస్ లో బాస్ తో దుర్భాషాలాడుతుంటారు. మరికొన్నిసార్లు.. గొడవలు, హత్యల వరకు వెళ్తుంటాయి. ఈ కోవకు చెందిన ఘటన వార్తలలో నిలిచింది. పూర్తి వివరాలు... అమెరికాలో (America) షాకింగ్ ఘటన ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. హ్యూస్టన్ నగరంలో 2014, జనవరి 30 న ఒక వ్యక్తి వచ్చి.. మాయోయ్ సన్(50), మెయిక్సీ సన్( 49), తిమోతీ సన్( 9), టైటస్ సన్(7),లను ఇంటికి వెళ్లి అతి క్రూరంగా గన్ తో కాల్చి పారిపోయాడు. దీంతో ఈ ఘటన అప్పట్లో సంచలనంగా మారింది. దీనిపై అధికారులు విచారణ చేపట్టారు. కాగా, తాజాగా నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. అతడిని అదుపులోనికి తీసుకొని విచారించగా సంచలన విషయాలు వెల్లడించాడు. పోలీసుల ప్రకారం.. ఫాంగ్ లు అనే వ్యక్తి.., మాయోయ్ సన్ అనే వ్యక్తి దగ్గర పనిచేస్తున్నాడు. అతను కంపెనీలో ఉద్యోగులందరికి ప్రమోషన్ వచ్చేలా రికమండ్ చేశాడు. అందరికి ప్రమోషన్ లు వచ్చాయి. కానీ ఫాంగ్ లు కు మాత్రం పదోన్నతి రాలేదు. దీంతో అతని కోపం కట్టలు తెంచుకుంది. తన బాస్ వలనే తనకు ప్రమోషన్ రాలేదని ఆగ్రహంతో ఊగిపోయాడు. వెంటనే అతని ఇంటికి వెళ్లి గన్ తో ఇంట్లో ఉన్నవారిని పిట్టల్లా కాల్చిపారేశాడు. దీంతో ఆ ప్రాంతంలోని ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యాడు. బాస్ కుటుంబం అందరిని హత్యచేసి, ఆ తర్వాత పారిపోయాడు. కేవలం ప్రమోషన్ రాకపోవడం వలన ఇంతటి ఘాతుకానికి పాల్పడినట్లు నిందితుడు పోలీసులకు తెలిపాడు. అప్పటి నుంచి నిందితుడు పరారీలో ఉన్నాడు. కాగా, నిందితుడిని పోలీసులు సెప్టెంబరు 11న కాలిఫోర్నియా విమానాశ్రయంలో పట్టుకుని జైలుకు తరలించారు.
Published by:Paresh Inamdar
First published:

Tags: America, Crime news

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు