హోమ్ /వార్తలు /క్రైమ్ /

Husband: గొప్పోడివిరా బాబూ.. ఒకే ఊళ్లో ఇద్దరితో కాపురం పెట్టి.. కానీ కొంప మునిగింది ఎక్కడంటే..

Husband: గొప్పోడివిరా బాబూ.. ఒకే ఊళ్లో ఇద్దరితో కాపురం పెట్టి.. కానీ కొంప మునిగింది ఎక్కడంటే..

ఇద్దరిని పెళ్లి చేసుకుని.. ఒకరికి తెలియకుండా మరొకరితో కొన్నాళ్లు ఇక్కడ.. కొన్నాళ్లు అక్కడ ఉంటూ మ్యానేజ్ చేస్తుండే భర్తల గురించి చాలా సినిమాల్లో చూశాం. కానీ.. నిజ జీవితంలో కూడా ఇలాంటి భర్తలు ఉన్నారంటే ఎవరికీ నమ్మాలనిపించదు.

ఇద్దరిని పెళ్లి చేసుకుని.. ఒకరికి తెలియకుండా మరొకరితో కొన్నాళ్లు ఇక్కడ.. కొన్నాళ్లు అక్కడ ఉంటూ మ్యానేజ్ చేస్తుండే భర్తల గురించి చాలా సినిమాల్లో చూశాం. కానీ.. నిజ జీవితంలో కూడా ఇలాంటి భర్తలు ఉన్నారంటే ఎవరికీ నమ్మాలనిపించదు.

ఇద్దరిని పెళ్లి చేసుకుని.. ఒకరికి తెలియకుండా మరొకరితో కొన్నాళ్లు ఇక్కడ.. కొన్నాళ్లు అక్కడ ఉంటూ మ్యానేజ్ చేస్తుండే భర్తల గురించి చాలా సినిమాల్లో చూశాం. కానీ.. నిజ జీవితంలో కూడా ఇలాంటి భర్తలు ఉన్నారంటే ఎవరికీ నమ్మాలనిపించదు.

  సోనిపట్: ఇద్దరిని పెళ్లి చేసుకుని.. ఒకరికి తెలియకుండా మరొకరితో కొన్నాళ్లు ఇక్కడ.. కొన్నాళ్లు అక్కడ ఉంటూ మ్యానేజ్ చేస్తుండే భర్తల గురించి చాలా సినిమాల్లో చూశాం. కానీ.. నిజ జీవితంలో కూడా ఇలాంటి భర్తలు ఉన్నారంటే ఎవరికీ నమ్మాలనిపించదు. కానీ.. ఉన్నారండీ బాబూ. తాజాగా హర్యానాలోని సోనిపట్ జిల్లాలో వెలుగుచూసిన తాజా ఘటనే నిదర్శనం. మొదటి భార్యకు తెలియకుండా మరో అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇద్దరితో పిల్లల్ని కని కొన్నేళ్ల పాటు మ్యానేజ్ చేసిన భర్త బాగోతం మొదటి భార్యకు డౌటొచ్చి పసిగట్టడంతో బయటపడింది.

  ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. హర్యానా సోనిపట్ జిల్లాలోని ముర్తాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వివాహిత రవీంద్ర అనే తన భర్తతో కలిసి ఓ అపార్ట్‌మెంట్ ఫ్లాట్‌లో నివాసం ఉంటోంది. 2004లో రవీంద్రకు, బాధిత మహిళకు వివాహం జరిగింది. వీళ్లకు ఎనిమిదేళ్ల వయసున్న పాప కూడా ఉంది. పాపను చూసుకుంటూ కొన్నేళ్ల నుంచి ఈ జంట ఎంతో సంతోషంగా ఉంది. అయితే.. గత కొన్ని నెలలుగా రవీంద్ర ప్రవర్తనలో మార్పును భార్య గమనించింది. ఇంట్లో తనతో, పాపతో సమయం గడిపేందుకు రవీంద్ర ఆసక్తి చూపడం లేదు.

  ఇది కూడా చదవండి: Tearful Incident: తట్టుకోలేరు.. అస్సలు తట్టుకోలేరు.. మరీ ఇంత బాధనా.. అసలేం జరిగిందంటే..

  పని మీద వెళుతున్నానంటూ రోజుల పాటు ఇంటి ముఖం చూసేవాడు కాదు. దీంతో.. తన భర్త బయట ఎవరితోనైనా వివాహేతర సంబంధం కొనసాగిస్తూ భార్య అయిన తననూ, పాపను నిర్లక్ష్యం చేస్తున్నాడేమోనన్న అనుమానం ఆమెలో కలిగింది. ఆ అనుమానంతో రవీంద్రకు తెలియకుండా అతని భార్య ఇటీవల ఒకరోజు నిఘా పెట్టింది. భర్తను ఫాలో అవుతూ వెళ్లిన ఆమెకు పచ్చి నిజం తెలిసింది. తన భర్త అదే పట్టణంలో ఓ మహిళ ఇంట్లోకి వెళ్లడాన్ని ఆమె గమనించింది.

  ఇది కూడా చదవండి: Husband: ఈమె భర్త వయసు 42 సంవత్సరాలు.. ఈ వయసులో అయ్యగారు ఏం చేశారో చూడండి..

  ఆరా తీయగా.. ఆ మహిళను తన భర్త పెళ్లి చేసుకున్నాడని మొదటి భార్యకు తెలిసింది. ఈ విషయం తెలిసి ఆమె తీవ్ర మనస్తాపం చెందింది. ఆ మహిళతో కాపురం చేసిన తన భర్త ఇద్దరు పిల్లలకు తండ్రి అని కూడా తెలిసి మొదటి భార్య షాకయింది. ఆ పిల్లలు కూడా స్కూల్‌కు వెళుతున్నారని తెలుసుకున్న రవీంద్ర మొదటి భార్య ఆ పిల్లలు చదువుకున్న స్కూల్‌కు వెళ్లింది. ఆ పిల్లలకు సంబంధించి స్కూల్‌కు ఇచ్చిన వివరాల్లో తండ్రి పేరు రవీంద్ర అని ఉండటాన్ని అతని మొదటి భార్య చూసింది.

  ఇది కూడా చదవండి: OMG: అబ్బో.. కుర్రాళ్లను రెచ్చగొడుతోందిగా.. ఈ ఆంటీ ఇప్పుడు ఎవరూ ఊహించని విధంగా కనిపించి షాకిచ్చింది..

  దీంతో.. తన భర్త ఆమెను పెళ్లి చేసుకుని, ఈ పిల్లలకు తండ్రి అనే విషయం వాస్తవమేనని రవీంద్ర మొదటి భార్య గ్రహించింది. వెంటనే.. భర్త రవీంద్రను ఈ విషయమై నిలదీసింది. అయితే.. ఈ విషయంపై తర్వాత మాట్లాడదామని బుకాయిస్తూ వచ్చిన రవీంద్రను అతని మొదటి భార్య ఆధారాలు చూపించి మరీ అడిగే సరికి బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ విషయాన్ని వదిలేయకపోతే తననూ, పాపనూ చంపేస్తానని బెదిరించాడని రవీంద్రపై అతని మొదటి భార్య ఫిర్యాదు చేసింది. ఒకే టౌన్‌లో ఇద్దరు భార్యలతో ఒకరికి తెలియకుండా ఒకరితో కాపురం చేసి ఇన్నేళ్లూ మ్యానేజ్ చేసిన రవీంద్ర గురించి తెలిసి పోలీసులు అవాక్కయ్యారు. రవీంద్రపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి నిందితుడిని అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు.

  First published:

  Tags: Haryana, Husband, Second marriage, Wife

  ఉత్తమ కథలు