మైనర్‌ బాలికతో సెక్స్‌ కోసం 565 కి.మీ నడక... అక్కడే అసలైన ట్విస్ట్

బాలికను తనను కలవాల్సిందిగా కోరాడు. దీనికి అటువైపు నుంచి అంగీకారంతో రావడంతో ఇండియానా నుంచి విస్కాన్సిన్‌కు నడవటం ప్రారంభించాడు. అలా దాదాపు 565 కిలోమీటర్లు నడిచాడు. దారి పొడువునా వివిధ ప్రాంతాల్లో పోటోలు దిగుతూ... అమ్మాయికి పంపాడు.

news18-telugu
Updated: October 16, 2019, 8:54 AM IST
మైనర్‌ బాలికతో సెక్స్‌ కోసం 565 కి.మీ నడక... అక్కడే అసలైన ట్విస్ట్
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
ఫేస్ బుక్ మనకు చాలా కొత్త విషయాల్ని... కొత్త వ్యక్తుల్ని పరిచయం చేస్తోంది. ప్రపంచం నలుమూలల ఉన్న స్నేహితుల్ని, బంధవుల్ని కలుపుతుంది. ఇంతవరకుబాగానే ఉన్నా. కొందరు దీన్ని మిస్ యూజ్ చేస్తున్నారు. ఫేస్ బుక్‌లో చాలామంది అమ్మాయిలు... కామాంధులకు బలి అయిపోయిన కేసులు మనం ఎన్నో విన్నాం. ఫేస్ బుక్ ద్వారా జరిగే అనేక సైబర్ నేరాల్ని కూడా మనం చూశాం. అయితే తాజాగా చోటు చేసుకున్న ఓ ఘటన ఫేస్ బుక్‌లో కూడా మైనర్ బాలికలపై లైంగిక వేధింపులు జరుగుతున్నాయనడానికి నిలువుటద్దంలా నిలిచింది. దానితో పాటు బాలిక న్యూడ్ ఫోటోలు పంపించాల్సిందిగా కోరేవాడు. ఈ నేపథ్యంలోనే ఆ బాలికను తనను కలవాల్సిందిగా కోరాడు.

దీనికి అటువైపు నుంచి అంగీకారంతో రావడంతో ఇండియానా నుంచి విస్కాన్సిన్‌కు నడవటం ప్రారంభించాడు. అలా దాదాపు 565 కిలోమీటర్లు నడిచాడు. దారి పొడువునా వివిధ ప్రాంతాల్లో పోటోలు దిగుతూ... అమ్మాయికి పంపాడు. అలా చివరకు బాలిక ఉంటున్న విస్కాన్సిన్‌కు ప్రాంతానికి చేరుకున్నాడు. అక్కడికి వెళ్లగానే... జెంకిన్స్‌కు అసలైన ట్విస్ట్ ఎదురైంది. 14 ఏళ్ల బాలిక ప్లేస్‌లో జెంకిన్స్‌కు పోలీసులు కనిపించారు. వెంటనే అతడ్ని అరెస్ట్ చేశారు.

దీని వెనెక అసలు స్టోరీ వేరేగా ఉంది. చిన్నారులపై రోజు రోజుకి పెరిగిపోతోన్న దారుణాలకు అడ్డుకట్ట వేసేందుకు గాను అమెరికా ప్రభుత్వం రంగంలోకి దిగింది. సోషల్ మీడియా ద్వారానే ఈ అకృత్యాలు ఎక్కువగా జరుగుతుండటంతో వాటిపై దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలోనే ఒక పోలీస్ అధికారి కైలీ అనే బాలిక పేరుతో నకిలీ ఫేస్‌బుక్‌ ఖాతాను క్రియేట్ చేశాడు. తన వయసు 14 ఏళ్లని, విస్కాన్సిన్‌లోని నిన్హా ప్రాంతంలో నివసిస్తున్నట్లు ప్రొఫైల్‌లో పేర్కొన్నారు.అలా తన అకౌంట్ నుంచి చాలామందికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించాడు. ఈ క్రమంలో ఇండియానాకు చెందిన టామీ లీ జెంకిన్స్ కైలీ పేరుతో ఉన్న పోలీస్ ఆఫీసర్ రిక్వెస్ట్‌ను యాక్సెప్ట్ చేశాడు. కొద్దిరోజుల పరిచయం తర్వాత జెంకిన్స్.. ప్రతిరోజూ లైంగిక పరమైన అంశాలు చర్చించడం మొదలుపెట్టాడు.అలా మైనర్ బాలికతో శృంగారం కోసం జెంకిన్స్ 565 కిలోమీటర్లు నడిచి చివరకు
పోలీసుల చేతికి చిక్కి కటకటాలపాలయ్యాడు.
Published by: Sulthana Begum Shaik
First published: October 16, 2019, 8:52 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading