Home /News /crime /

MAN VIOLATED WITH STICK ELECTRIC SHOCKS IN POLICE CUSTODY ACTION AGAINST UTTAR PRADESH COPS PAH

OMG: అమానుషం.. కస్టడీలో ఉన్న వ్యక్తికి కరెంట్ షాక్, ప్రైవేటు భాగాల్లో తీవ్రగాయాలు.. అసలేం జరిగిందంటే..

తీవ్రంగా గాయపడిన వ్యక్తి

తీవ్రంగా గాయపడిన వ్యక్తి

Uttar pradesh: కస్టడీలో ఉన్న వ్యక్తిని పోలీసులు చిత్రహింసలకు గురిచేశారు. అతడికి కరెంట్ షాక్ ఇవ్వటమే కాకుండా, విచక్షణ రహితంగా దాడిచేశారు.

కొందరు పోలీసులు జైలులో నిందితుల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తుంటారు. నేరాన్ని ఒప్పుకొవాలంటూ అనుమానితులను కుల్లపోడుస్తుంటారు. కర్రలు, బెల్టులతో కొడుతుంటారు. మరికొన్ని సార్లు షాక్ లు కూడా ఇస్తుంటారు. కొన్ని సార్లు పోలీసులు అరాచకానికి బాధితులు జైళ్లలోనే చనిపోయిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. ఇలాంటి ఘటనలో ఎన్నో గతంలో జరిగాయి. తాజాగా, ఇలాంటి సంఘటన వార్తలలో నిలిచింది.

పూర్తి వివరాలు.. ఉత్తర ప్రదేశ్ లో (Uttar pradesh) అమానవీయకర సంఘటన జరిగింది. పశువులను దొంగిలించాడని కేసుపై, బడాయున్ పోలీసులు రెహాన్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. ఈ క్రమంలో స్టేషన్ అధికారి,మిగతా పోలీసులు చిత్రహింసలకు గురిచేశారు. లాఠీలతో కొడుతు, అతని ప్రైవేటు పార్ట్ లలో కుళ్లబొడిచాడు. అంతటితో ఆగకుండా, కరెంట్ షాక్ ఇచ్చారు. కాగా, బాధితుడిని చూడటానికి అతని బంధువులు వచ్చినప్పుడు ఈ ఉదంతం వెలుగులోనికి వచ్చింది.

పోలీసులు.. రెహన్ ను విడిచిపెట్టాలంటే... 5వేలు కావాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాతే స్టేషన్ బెయిల్ ఇస్తామని అన్నారు. దీంతో బాధిత కుటుంబ సభ్యులు అడిగినంత ఇచ్చుకుని తమ కొడుకుని ఇంటికి తీసుకెళ్లారు. ఆ తర్వాత.. జరిగిన దారుణాన్ని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై సీరియస్ అయిన అధికారులు.. స్టేషన్ ఇన్ చార్జితో పాటు ఏడుగురిపై కేసు నమోదు చేశారు. ఇప్పటి వరకు నలుగురిని సస్పెండ్ చేశారు. బాధితుడు.. దొంగతనం కేసులో నిందితుడిని పోలీసులు గత నెలలో అదుపులోకి తీసుకున్నారు. అతను పశువుల స్మగ్లర్ల బృందానికి సహాయం చేస్తున్నాడని పోలీసులు ఆరోపించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న అధికారులు విచారణ చేపట్టారు.

ఇదిలా ఉండగా ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ ఫుడ్ డెలివరీ బాయ్ పట్ల దారుణంగా ప్రవర్తించాడు.

తమిళనాడులో (Tamil nadu) అమానుషం జరిగింది. శుక్రవారం జరిగిన ఈ సంఘటన, వీడియో వైరల్ కావడంతో ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. సింగనల్లూరు పోలీస్ స్టేషన్ కు చెందిన కానిస్టేబుల్ (Traffic constable) సతీష్ శుక్రవారం అవినాశి రోడ్డులో ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో .. అక్కడ ఒక డెలివరీ చేసే బాయ్ ను (Swiggy delivery boy) పక్కకు తీసుకెళ్లాడు. అతడిని చెంపలమీద విచక్షణ రహితంగా దాడిచేశారు. ఫోన్ తీసి లాక్కున్నాడు. ఆ తర్వాత ద్విచక్రవాహనాన్ని ధ్వంసం చేశాడు. 38 ఏళ్ల మోహన సుందరం గత రెండేళ్లుగా స్విగ్గీలో డెలివరీ బాయ్ గా పనిచేస్తున్నాడు.

అతను అగ్రిగేటర్ హోటల్ వద్ద ఉన్నప్పుడు శుక్రవారం.. ఒక ప్రైవేటు బస్సు అతివేగంగా వచ్చింది. రెండు ద్విచక్రవాహనాలు, రోడ్డుపై నడుస్తున్న వారిని ఢీకొట్టబోయింది. ఈ క్రమంలో.. బస్సు డ్రైవర్ ను, స్విగ్గీ డెలివరీ బాయ్ రోడ్డుపక్కన ఆపాడు. బస్సును వేగంగా నడిపితే ప్రాణాలు పోతాయని డ్రైవర్ కు తెలిపారు. అయితే, కొంత సేపు అక్కడ ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఇంతలో అక్కడ విధుల్లో ఉన్న కానిస్టేబుల్ , సతీష్ అక్కడికి వచ్చాడు. స్విగ్గీ డెలివరీ బాయ్ మోహన సుందరాన్ని బూతులు తిడుతూ, విచక్షణ రహితంగా కొట్టాడు. రోడ్డుపైన ఏదైన జరిగితే తాము చూసుకుంటామని నోటికొచ్చినట్లు తిట్టాడు. బస్సు ఎవరిదో తెలుసా.. అంటూ మోహన సుందరాన్ని బెదిరించాడు. రోడ్డుమీద ట్రాఫిక్ జామ్ తాము.. చూసుకుంటామని, అది నీపని కాదంటూ, మోహన సుందరాన్ని చితకొట్టాడు.
Published by:Paresh Inamdar
First published:

Tags: Crime news, Police Case, Uttar pradesh

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు