హోమ్ /వార్తలు /క్రైమ్ /

నల్గొండలో సీఐ వాహనంతో పరారైన యువకుడు.. చివరకు ఏమైదంటే

నల్గొండలో సీఐ వాహనంతో పరారైన యువకుడు.. చివరకు ఏమైదంటే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

నల్గొండలో ఓ యువకుడులో పోలీసు వాహనంతోనే పరారయ్యేందుకు యత్నించాడు. మద్యం మత్తులో అతడు ఈ విధంగా చేశాడు.

నల్గొండలో ఓ యువకుడులో పోలీసు వాహనంతోనే పరారయ్యేందుకు యత్నించాడు. మద్యం మత్తులో అతడు ఈ విధంగా చేశాడు.  వివరాలు.. మిర్యాలగూడ పట్టణంలోని ఈదులగూడలో సీఐ రమేశ్‌ బాబు ఆధ్వర్యంలోని బృందం పెట్రోలింగ్ నిర్వహించారు. అక్కడ ఓ వెంచర్‌లో అర్ధరాత్రి నలుగురు యువకులు మద్యం సేవిస్తూ కనిపించారు. బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్నందరకు సీఐ వారిని విచారించడం మొదలుపెట్టాడు. సీఐ యువకులను విచారిస్తున్న సమయంలో.. అందులో ఓ యువకుడు పోలీసుల కళ్లు గప్పి అక్కడ నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. ఏకంగా సీఐ వాహనంతోనే కోదాడ వైపు పరారయ్యాడు.

దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అతడిని వెంబండిచిన పోలీసులు చివరకు ఆళ్లగడప టోల్ గేటు వద్ద వాహనాన్ని పట్టకున్నారు. యువకుడిని అదుపులోకి తీసుకుని, వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇక, పోలీసులకు చిక్కకముందు మద్యం మత్తులో ఉన్న ఆ యువకుడు వాహనాన్ని వేగంగా నడిపాడు. ఈ క్రమంలోనే ఎదురుగా వస్తున్న వాహనాన్ని పోలీసు వాహనం ఢీకొట్టింది. దీంతో కారు ముందు భాగం ధ్వంసమైంది.

First published:

Tags: Nalgonda

ఉత్తమ కథలు