పండగ సెలవల కోసం ఇంటికి వచ్చిన భార్య చెల్లిపై కన్నేశాడు...చివరకు ఏం జరిగిందంటే..?

బాధితురాలిపై మొదటి రోజు నుంచి కన్నేశాడు. ఆమెతో ద్వంద్వార్థం స్ఫురించేలా కామెంట్స్ చేసేవాడు. అంతేకాదు అవకాశం దక్కినప్పుడల్లా ఆమెతో చనువుగా ఉండేందుకు ప్రయత్నం చేసేవాడు. ఈ నేపథ్యంలో ఒక రోజు రాత్రి సమయంలో సోనం నిద్రిస్తున్న గదిలోకి నిందితుడు ప్రవేశించి తలుపు గడియ పెట్టి, ఆమెపై లైంగిక దాడికి యత్నం చేశాడు.

news18-telugu
Updated: October 7, 2019, 5:19 PM IST
పండగ సెలవల కోసం ఇంటికి వచ్చిన భార్య చెల్లిపై కన్నేశాడు...చివరకు ఏం జరిగిందంటే..?
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఫెస్టివల్ సందర్భంగా కాలేజీకి సెలవలు ఇచ్చారని అక్క ఇంటికి వెళ్లిన సోదరికి చేదు అనుభవం ఎదురైంది. అక్క భర్తే ఆమె పాలిట కీచకుడయ్యాడు. వివరాల్లోకి వెళితే హర్యానాలోని సోనిపట్ జిల్లాలో బాధితురాలు సోనం (పేరు మార్పు) స్థానిక కళాశాలలో పోస్ట్ గ్రాడ్యూయేషన్ చేస్తోంది. అయితే కాలేజీకి వరుసగా సెలవలు ఇచ్చిన నేపథ్యంలో అదే ప్రాంతంలో నివాసముంటున్న తన సోదరి ఇంటికి వెళ్లాలని నిశ్చయించుకొని వెళ్లింది. కాగా సోదరి భర్త బాధితురాలిపై మొదటి రోజు నుంచి కన్నేశాడు. ఆమెతో ద్వంద్వార్థం స్ఫురించేలా కామెంట్స్ చేసేవాడు. అంతేకాదు అవకాశం దక్కినప్పుడల్లా ఆమెతో చనువుగా ఉండేందుకు ప్రయత్నం చేసేవాడు. ఈ నేపథ్యంలో ఒక రోజు రాత్రి సమయంలో సోనం నిద్రిస్తున్న గదిలోకి నిందితుడు ప్రవేశించి తలుపు గడియ పెట్టి, ఆమెపై లైంగిక దాడికి యత్నం చేశాడు.

బాధితురాలు వెంటనే లేచి పెద్దగా కేకలు వేసినప్పటికీ, నిందితుడు ఆమెను శారీరకంగా హింసించి తన కోరిక తీర్చుకోవాలని ప్రయత్నం చేశాడు. ఇంతలో బాధితురాలి సోదరి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, వెంటనే రంగప్రవేశం చేసిన ఖాకీలు నిందితుడిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. విచారణ కొనసాగుతోంది.

ఈ బెంగాలీ భామ అందాలు చూస్తే తట్టుకోలేరు..First published: October 7, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు