బ్యాగు నిండా వేరు శనగలు... పొట్టు విప్పి చూసి షాకైన అధికారులు...

వేరు శనగ లోపల డ్రగ్స్ పెట్టి స్మగ్లింగ్ చేస్తూ దొరికిపోయిన స్మగ్లర్... పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో సంఘటన.

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: April 6, 2019, 11:29 AM IST
బ్యాగు నిండా వేరు శనగలు... పొట్టు విప్పి చూసి షాకైన అధికారులు...
బ్యాగు నిండా వేరు శనగలు... పొట్టు విప్పి చూసి షాకైన అధికారులు...
Chinthakindhi.Ramu | news18-telugu
Updated: April 6, 2019, 11:29 AM IST
బ్యాగు నిండి పల్లీలు వేసుకుని, మోసుకెళ్తున్న ఓ ప్రయాణికుడిని చూసి ఎయిర్‌పోర్ట్ అధికారులకు అనుమానం వచ్చింది. బ్యాగు నిండా వేరు శనగలు ఎందుకు తీసుకెళ్తున్నావంటూ అతన్ని నిలదీశారు. దానికి అతను ‘మా ఇట్లో వాళ్లకు చాలా ఇష్టం ఇవంటే...అందుకే తీసుకెళ్తున్నా’ అంటూ సమాధానం చెప్పాడు అతను.
ఇష్టం ఉంటే ఓ ఊరి నుంచి వేరే ఊరికి వెళ్లేటప్పుడు అయితే ఇలా తీసుకెళ్లొచ్చు కానీ ఓ దేశం నుంచి మరోదేశానికి తీసుకెళ్లడం ఏంటని అనుమానం వచ్చింది కస్టమ్స్ అధికారులు. అనుమానంతో బ్యాగులోని పల్లీలు విప్పి చూడగా... లోపల దాచిన డ్రగ్స్ బయటపడ్డాయి. పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో జరిగిందీ సంఘటన. పల్లీల్లోపల డ్రగ్స్ కుచ్చి, వాటిని మళ్లీ అతికించి... స్మగ్లింగ్ చేస్తూ పట్టుబట్టాడో స్మగ్లర్. ఈ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు అధికారులు. కొన్నిరోజుల్లోనే ఇవి తెగ వైరల్ కావడం విశేషం. మరీ విచిత్రంగా పల్లీల్లో డ్రగ్స్ పెట్టి స్మగ్లింగ్ చేయడం ఏంట్రా? అని ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. స్మగ్లింగ్ చేసేందుకు స్మగ్లర్లు కొత్త కొత్తగా ఆలోచిస్తున్నారంటూ మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు. కొన్నిరోజుల కిందట బ్రా లోపల బంగారు బిస్కట్లు పెట్టుకుని స్మగ్లింగ్ చేస్తూ చెన్నై ఎయిర్‌పోర్ట్ అధికారులకు దొరికిపోయిందో థాయ్ మహిళ. అంతకుముందు ఏకంగా అండర్‌వేర్‌లో బంగారం దాచుకుని వెళ్తూ పట్టుబడిందో మహిళ. ఇప్పుడు వేరు శనగ గుండ్లలో డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తూ దొరికిపోయాడు ఓ స్మగ్లర్. దొరికిన వారే ఇంత కొత్తగా ఆలోచిస్తుంటే... దొరకకుండా మరెన్ని ఆలోచనలు చేస్తున్నారో అని అనుమానిస్తున్నారు నెటిజన్లు.


First published: April 6, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...