news18-telugu
Updated: October 6, 2020, 7:13 AM IST
ప్రతీకాత్మక చిత్రం
39 ఏళ్ల వయసు ఉన్న వ్యక్తి దారుణానికి ఓడిగట్టాడు. 50 ఏళ్ల వయసు ఉన్న అత్తను రేప్ చేశాడు. చివరకు ఈ విషయం పోలీసులకు తెలియడంతో.. భయపడి ఆత్మహత్య యత్నం చేశాడు. ఈ ఘటన తమిళనాడులోని కడలూరు జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలు.. పన్రుతి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఆదివారం అదే గ్రామంలో ఉంటున్న తన అత్త ఇంటికి వెళ్లాడు. భర్త చనిపోవడంతో ఆమె ఒంటరి జీవితం సాగిస్తుంది. ఇదే అదనుగా నిందితుడు ఆమెను రేప్ చేశాడు. ఆమెకు ఇంటర్నల్గా గాయాలు కావడంతో కడలూరు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కు తరలించారు. అక్కడ ఆమెకు చికిత్స అందించిన వైద్యులు.. ఈ విషయాన్ని పోలీసులకు చేరవేశారు.
దీంతో పన్రుతిలోని మహిళ పోలీస్ స్టేషన్ను చెందిన బృందం బాధితురాలిని కలిసింది. ఆమె నుంచి ప్రాథమిక సమాచారం సేకరించింది. ఆమె ఇచ్చిన సమాచారం ఆధారంగా పోలీసులు నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 376 కింద రేప్ కేసు నమోదు చేశారు. అయితే తనపై కేసు నమోదు అయిన విషయం తెలుసుకున్న నిందితుడు కంగారు పడిపోయాడు. పోలీసులు తనను ఏం చేస్తారనే భయంతో పలు ఆలోచనలు చేశాడు.
చివరకు తన ఇంటి సమీపంలోనే ఆత్మహత్యకు యత్నించాడు. సమయానికి దీనిని గుర్తించిన స్థానికులు అతన్ని కాపాడారు. అనంతరం అతన్ని చికిత్స నిమిత్తం కడలూరు గవర్నమెంట్ జనరల్ ఆస్పత్రికి తరలించారు.
Published by:
Sumanth Kanukula
First published:
October 6, 2020, 7:13 AM IST