బాలీవుడ్ నటుడి కూతురికి బ్లాక్‌మెయిల్... ఆ ఫొటోలు చూపిస్తూ...

ఈ మొబైల్ వచ్చాక... ఇలాంటివి ఎక్కువైపోయాయి. ఎలాగొలా సీక్రెట్ ఫొటోలను సేకరించడం ఆ తర్వాత బ్లాక్‌మెయిల్. ఈ కేసులో ఏం జరిగిందో వివరంగా తెలుసుకుందాం.

news18-telugu
Updated: August 2, 2020, 11:26 AM IST
బాలీవుడ్ నటుడి కూతురికి బ్లాక్‌మెయిల్... ఆ ఫొటోలు చూపిస్తూ...
బాలీవుడ్ నటుడి కూతురికి బ్లాక్‌మెయిల్... ఆ ఫొటోలు చూపిస్తూ... (File)
  • Share this:
ముంబైలో కరోనా కేసులు తగ్గుతున్నాయి కానీ... క్రైమ్ కేసులు తగ్గట్లేదు. మాఫియా ముఠాలకు తోడు... అడ్డమైన నేరాలకు అడ్డాగా మారింది మన దేశ ఫైనాన్షియల్ సిటీ. తాజాగా ముంబై క్రైమ్ బ్రాంచ్... 25 ఏళ్ల ఓ మొండి కుర్రాణ్ని బలవంతంగా అరెస్టు చేసి లాక్కెళలారు. అతను చేసిన ఘనకార్యం ఏంటంటే... ఓ బాలీవుడ్ నటుడి కూతురిని బ్లాక్‌మెయిల్ చెయ్యడం. "నేను చెప్పినట్లు డబ్బు ఇవ్వలేదనుకో... ఆ ఫొటోలను ప్రపంచానికి చూపిస్తా... పరువు పోతుంది. ఏ నిద్రమాత్రలో మింగి చావాల్సి వస్తుంది. అవసరమా ఇదంతా... అందుకే నోరు మూసుకొని మనీ ఇచ్చేయ్" అని బెదిరించాడు. అసలే కరోనాపై పిచ్చి కోపంతో ఉందామె. మధ్యలో వీడెవడు నన్ను బెదిరిస్తాడు. వీడికుంది అనుకుంటూ... ముంబై క్రైమ్ బ్రాంచ్‌కి కాల్ చేసింది. "అంకుల్... వాడెవడో ఎక్స్‌ట్రాలు చేస్తున్నాడు" అంటూ మేటర్ చెప్పింది. "డోంట్ వర్రీ... హమ్ హైనా... తోలుతీస్తాం" అన్న పోలీసులు.. తోలు తియ్యకుండా జాగ్రత్తగా అతన్ని లాక్కుపోయారు.

నిందితుడి పేరు ఖుమాయిల్ హనిఫ్ పటానీ. ముంబైలోని మలాడ్‌లో ఉండేవాడు. పాతికేళ్లకే నేరాల్లో ఆరితేరినట్లున్నాడు. అతన్ని పట్టుకోవడానికి పోలీసులకు 11 రోజులు పట్టింది. దొరికాక రూల్స్ ప్రకారం రకరకాల కేసులు బుక్ చేశారు. ఆమెకు సంబంధించిన ప్రైవేట్ ఫొటోలను సేకరించినందుకు ఇన్ఫర్మేషన టెక్నాలజీ యాక్ట్ కింద కూడా కేసు బుక్కైంది.

ఇక్కడ చిన్న ఇంట్రస్టింగ్ మేటర ఒకటుంది. ఆ నిందితుడి చెల్లి... ఈ బాధితురాలూ ఇద్దరూ తెలిసినవాళ్లే. ఎందుకంటే ఇద్దరూ ఒకే కాలేజీలో చదువుకున్నారు. నిందితుడు జులైలో బాధితురాలికి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ మెసేజ్ పంపాడు. కాలేజీ రోజుల నుంచి నువ్వు నాకు తెలుసు. నీ వెనకాలే ఫాలో అయ్యా. నీ ప్రైవేట్ ఫొటోలు సేకరించా. ఇప్పుడు నువ్వు నేను చెప్పినట్లు చెయ్యాలి. నాకు రూ.20వేలు ఇవ్వాలి. లేదంటే నీ ప్రైవేట్ ప్రపంచానికి చూపిస్తా అని బెదిరించాడు. ఆమె మెసేజ చదివాక... దాన్ని డిలీట్ చేశాడు. తద్వారా తాను పోలీసులకు దొరకను అనుకున్నాడు.

బాధితురాలు రిప్లై ఇవ్వకుండా ఊరుకుంది. రెండ్రోజుల తర్వాత మరింత ఎక్కువ మనీ అడిగాడు. ఇలాంటివి ఇండస్ట్రీలో ఎన్నో తెలుసుకొనీ, తెలుసుకొనీ బోర్ కొట్టిన ఆమె.. తిన్నగా వెళ్లి పేరెంట్స్‌కి మేటర్ చెప్పింది. తర్వాత పోలీసులకు కాల్ చేసింది. తర్వాత బంగూర్ నగర్ పోలీస్ స్టేషన్‌కి వెళ్లి కంప్లైంట్ ఇచ్చింది. విషయం తెలుసుకున్న నిందితుడు పారిపోయి... 10 రోజుల తర్వాత వచ్చాడు. అప్పటికే అతని ఇంటి దగ్గర సీక్రెట్ నిఘా పెట్టిన పోలీసులు... 11వ రోజున ఇంటికి వెళ్లారు. ఏదో కోపంలో ముఖానికి ఉన్న మాస్కుని తీసి నేల కేసి కొట్టాడు. అర్జెంటుగా దాన్ని తీసి తగిలించుకో... పద అన్నారు. విషయం అర్థమైన నిందితుడు. ఎందుకు... నేనెందుకు రావాలి... అంటూ ఎదురు తిరిగాడు. బ్లాక్‌మెయిల్ మేటర్ గుర్తుచేశారు. నేను ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ పెట్టినట్లు ఆధారాలున్నాయా అని అడిగాడు. నువ్వు డిలీట్ చేసినంత మాత్రాన లేవనుకోకు. ఇన్‌స్టాగ్రామ్ సర్వర్ నుంచి నీ చిట్టా మొత్తం లాగేశాం... అంటూ లాక్కుపోయారు.
Published by: Krishna Kumar N
First published: August 2, 2020, 11:26 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading