MAN TRIED TO KILL HER WIFE WHO BOUGHT SMARTPHONE AGAINST HER WISH IN KOLKATA AK
Wife: చీకట్లో భర్తను ఫాలో అయిన భార్య.. ఇంతలోనే ఊహించని షాక్.. అంతా ఒక్క ఫోన్ వల్లే..
ప్రతీకాత్మక చిత్రం
Wife Smartphone: స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనే ఆమె కోరిక మాత్రం అలాగే ఉండిపోయింది. ఎలాగైనా ఫోన్ కొనుగోలు చేయాలని డిసైడయ్యింది. భర్తను డబ్బు అడగకుండానే భార్య తన సంపాదనతో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసింది.
భార్యాభర్తల మధ్య తరచూ ఏదో ఒక విషయంలో గొడవలు జరుగుతూ ఉంటాయి. వీటికి కారణాలు ఏమై ఉంటాయనేది కొన్నిసార్లు ఊహించడం కూడా కష్టమే. అయితే ఒక్కోసారి మొబైల్ ఫోన్ కూడా ఇందుకు కారణం అవుతుంది. తమ భార్య స్మార్ట్ మొబైల్ ఫోన్ వాడటం కొంతమందికి నచ్చదు. కొన్నిసార్లు ఈ విషయంలో చాలా ఇళ్లలో గొడవలు కూడా జరుగుతుంటాయి. తాజాగా ఓ ఘటనలో భార్యాభర్తల మధ్య గొడవలు జరగడానికి ఈ స్మార్ట్‌ఫోన్ పెద్ద కారణమైంది. ఈ ఘటన వినడానికి కొంత ఆశ్చర్యంగా అనిపించినా.. వాస్తవానికి జరిగింది మాత్రం ఇదే. ఈ ఘటన పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో జరిగింది. కోల్‌కతాలోని నరేంద్రపూర్‌లో 40 ఏళ్ల వ్యక్తి తన భార్యతో నివసిస్తున్నాడు. కొన్ని నెలల క్రితం తనకు కొత్త స్మార్ట్‌ఫోన్ కొనివ్వమని భార్య తన భర్తను కోరింది. తనతో పాటు ఇళ్లలో ఉంటున్న అనేక మంది మహిళలు స్మార్ట్ ఫోన్ వాడుతున్నారని.. కాబట్టి తనకు కూడా స్మార్ట్ ఫోన్ కొనివ్వాలని భర్తను కోరింది.
ఈ విషయంలో అనేకసార్లు భర్తను రిక్వెస్ట్ చేసింది. అయితే భార్యకు స్మార్ట్ ఫోన్ కొనివ్వడం ఆమె భర్తకు అస్సలు ఇష్టం లేదు. దీని వల్ల ఆ తరువాత అనేక ఇబ్బందులు వస్తాయన్నది అతడి ఆలోచన. అందుకే భార్య ఎన్నిసార్లు స్మార్ట్ ఫోన్ కొనివ్వాలని కోరినా.. అతడు మాత్రం స్పందించలేదు. ఎప్పటికప్పుడు ఇందుకు నిరాకరించాడు. చివరకు తాను స్మార్ట్ ఫోన్ కొనివ్వబోనని.. ఈ విషయం మళ్లీ పదే పదే అడగొద్దని భార్యకు వార్నింగ్ ఇచ్చాడు. దీంతో అప్పటి నుంచి వారిద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. తాను ఎంతకోరినా.. భర్త ఫోన్ కొనివ్వకపోవడంతో.. అతడి భార్య కొంచెం బాధపడింది.
కానీ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనే ఆమె కోరిక మాత్రం అలాగే ఉండిపోయింది. ఎలాగైనా ఫోన్ కొనుగోలు చేయాలని డిసైడయ్యింది. భర్తను డబ్బు అడగకుండానే భార్య తన సంపాదనతో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసింది. జనవరి 1న భార్య చేతిలో భర్తకు స్మార్ట్ ఫోన్ కనిపించింది. కొత్త స్మార్ట్ ఫోన్ రావడంతో సంతోషించిన భార్యను చూసి భర్త ఆగ్రహంతో ఊగిపోయాడు. ఆమెను స్మార్ట్ ఫోన్ వాడొద్దని బెదిరించాడు. ఈ విషయంలో తన మాట వినాలని హుకుం జారీ చేశాడు. తన మాట వినకుంటే చంపేస్తానని బెదిరించాడు. గత గురువారం రాత్రి భర్త తన ఇంటి మెయిన్ డోర్‌కు తాళం వేసి బయటకు వెళ్లాడు. కానీ అతను వెంటనే తిరిగి రాలేదు.
ఆ తర్వాత భార్యకు భర్త వ్యవహారంపై అనుమానం వచ్చింది. భర్తను వెతకడానికి బయటకు వెళ్లింది. అప్పుడు కొందరు భార్యపై దాడి చేశారు. హంతకుల్లో ఒకడు మహిళ మెడపై పదునైన వస్తువుతో దాడి చేశాడు. దీంతో ఆమెకు తీవ్రంగా రక్తస్రావమైంది. మహిళ కేకలు వేయడంతో చుట్టుపక్కల వారిని పిలిచారు. ప్రజలు ఆమెను ఆసుపత్రికి తరలించారు. నిందితుడైన భర్తను, కిరాయి హంతకుడిని ప్రజలు పట్టుకున్నారు. అదే సమయంలో పరారీలో ఉన్న మరో వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. భార్య స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయడం.. భర్తకు ఏ మాత్రం ఇష్టంలేదని.. అందుకే అతడు ఈ రకమైన దుశ్చర్యకు పాల్పడ్డాడని పోలీసులు అనుమానిస్తున్నారు.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.