వేశ్యతో ప్రేమాయణం.. పెళ్లి చేసుకునేందుకు ప్లాన్.. సీన్‌లోకి పోలీసుల ఎంట్రీ.. స్టోరీలో ఊహించని ట్విస్టులు

ప్రతీకాత్మక చిత్రం

కొద్దిరోజుల క్రితం నిందితుడు ఓ వేశ్య దగ్గరకు వెళ్లాడు. ఆ తరువాత ఆమె దగ్గరకు తరుచుగా వెళ్లడం మొదలుపెట్టాడు. ఆమెతో ప్రేమలో పడిపోయాడు.

 • Share this:
  అతడికి భార్య ఉంది. స్కూల్‌కు వెళ్లే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కానీ అతడి బుద్ధి పక్కదారి పట్టింది. అతడిలోని నేర ప్రవృత్తి పడగ విప్పింది. దీంతో కట్టుకున్న భార్యను కడతేర్చేందుకు ప్లాన్ వేశాడు ఈ మాయగాడు. ఇందుకోసం పక్కాగా ప్లాన్ చేశాడు. ఢిల్లీలో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీకి చెందిన 36 ఏళ్ల వ్యక్తి కొద్దిరోజుల క్రితం రూ. 50000 పెట్టి రెండు పిస్టల్స్, బుల్లెట్లు కొనుగోలు చేశాడు. వాటితో పాటు మరిన్ని ఆయుధాలు కొనుగోలు చేశాడు. ఈ విషయం పోలీసులకు తెలిసింది. దీంతో నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు ట్రాప్ వేశారు. నిందితుడిని అరెస్ట్ చేశారు. అతడు ఈ తుపాకీ, బుల్లెట్లు ఎందుకు కొనుగోలు చేశాడనే అంశంపై విచారణ చేపట్టారు. అయితే తన భార్యను చంపేందుకు నిందితుడు ఈ ఆయుధాలు కొనుగోలు చేశారని తెలుసుకుని షాక్ అయ్యారు.

  నిందితుడికి 2006లో వివాహమైంది. అతడు పదో తరగతి వరకు చదువుకున్నాడు. అతడికి ఇద్దరు స్కూల్‌కు వెళ్లే పిల్లలు ఉన్నారు. 2006, 2011లో అతడిపై ప్రాస్టిట్యూషన్ కేసులు ఉన్నాయి. 2015లో అతడిపై అక్రమ ఆయుధాలకు అంశంపై కేసు కూడా ఉన్నాయి. దీంతో నిందితుడు ఎవరినో చంపేందుకు ఆయుధాలు కొనుగోలు చేశారని అనుకున్నారు. కానీ భార్యను చంపేందుకు అతడు ప్లాన్ చేశాడని తెలుసుకుని ఆశ్చర్యపోయారు.

  కొద్దిరోజుల క్రితం నిందితుడు ఓ వేశ్య దగ్గరకు వెళ్లాడు. ఆ తరువాత ఆమె దగ్గరకు తరుచుగా వెళ్లడం మొదలుపెట్టాడు. ఆమెతో ప్రేమలో పడిపోయాడు. ఆమెను పెళ్లి చేసుకోవాలని భావించాడు. ఇందుకు నిందితుడి భార్య ఒప్పుకోలేదు. అందుకే ఆమెను చంపేందుకు ప్లాన్ చేశాడు. ఇందుకోసం ఆయుధాలు కొనుగోలు చేశాడు. విషయం పోలీసులకు తెలియడంతో.. నిందితుడు అరెస్ట్ కావడంతో పాటు భార్యను చంపాలనే అతడి ప్లాన్ బట్టబయలైంది. మరోవైపు నిందితుడిని ఆయుధాలు అమ్మిన వ్యక్తుల కోసంపోలీసులు అన్వేషిస్తున్నారు.
  Published by:Kishore Akkaladevi
  First published: