చూస్తుండగానే కూతురి కిడ్నాప్... కారు డోర్ పట్టుకుని 10 కి.మీ.లు వెంటాడిన తల్లి...

కారులోకి యువతిని బలవంతంగా లాగి, ఎక్కించుకున్న యువకుడు... కారు డోర్ పట్టుకుని పది కిలోమీటర్లు వెంబడించిన యువతి తల్లి... కారును అడ్డుకుని కాపాడిన స్థానికులు... పశ్చిమగోదావరి జిల్లాలో కలకలం రేపిన సంఘటన...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: April 30, 2019, 6:28 PM IST
చూస్తుండగానే కూతురి కిడ్నాప్... కారు డోర్ పట్టుకుని 10 కి.మీ.లు వెంటాడిన తల్లి...
కళ్లెదుటే కూతురి కిడ్నాప్... కారు డోర్ పట్టుకుని 10 కి.మీ.లు వెంటాడిన తల్లి...
Chinthakindhi.Ramu | news18-telugu
Updated: April 30, 2019, 6:28 PM IST
కన్నబిడ్డ ఆపదలో ఉంటే తల్లి ప్రాణాలు ఎలా విలవిలలాడుతాయో తెలిసిందే. తన ప్రాణాలను కూడా లెక్కచేయకుండా బిడ్డను రక్షించేందుకు ముందుకు కదులుతుంది తల్లి. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లాలో అలాంటి ఓ సంఘటన జరిగింది. ఆపదలో ఉన్న కూతుర్ని రక్షించేందుకు, తన ప్రాణాలను లెక్కచేయకుండా కారు డోర్ పట్టుకుని వేలాడుతూ 10కి.మీ.లు వెంటాడిందో తల్లి. పశ్చిమగోదావరి జిల్లాలో పాలకోడేరు మండలంలోని విస్సాకోడేరు ఏరియాలో జరిగిన ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. విస్సాకోడేరు గ్రామానికి చెందిన అరుణకుమారి, తన కూతురు అనుషతో కలిసి సెంటర్‌కు వెళ్తోంది. ఆ సమయంలో అటుగా కారులో వచ్చిన ఓ యువకుడు... అనుషను కారులో బలవంతంగా ఎక్కించుకుని, ముందుకు పోనిచ్చాడు. కూతుర్ని కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించిన యువకుడిని గమనించిన అరుణకుమారి... వెంటనే కారు డోర్ పట్టుకుంది. ఆమెను చూసిన సదరు యువకుడు... వేగంగా కారును ముందుకు పోనిచ్చాడు. కారు వేగంగా వెళ్తున్న ఏ మాత్రం భయపడకుండా అలాగే డోర్ పట్టుకుని వేలాడుతూ వెంబడించింది అరుణకుమార్. ఇలా విస్సాకోడేరు నుంచి భీమవరం మండలంలోని తాడేరు వరకూ డోర్ పట్టుకుని వేలాడుతూనే వెళ్లింది. మార్గమధ్యంలో రక్షించాల్సిందిగా కేకలు వేయడంతో గుర్తించిన స్థానికులు... కారును వెంబడించి అడ్డుకున్నారు.

కారును అడ్డగించి ఆపిన స్థానికులు... అనుషను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించిన యువకుడిని చితకబాది, పోలీసులకు అప్పగించారు. అనుషను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించిన సదరు యువకుడి పేరు కాలేశ్ అని, కొంతకాలంగా ప్రేమిస్తున్నానంటూ అనుష వెంటపడి, వేధిస్తున్నాడని తెలిపారు పోలీసులు. కొన్ని నెలలుగా వెంటబడుతున్నా పట్టించుకోకపోవడంతో ఆవేశానికి లోనైన కాలేశ్... ఆమెను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించాడని తెలిపారు.


First published: April 30, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...