టీనేజీ అమ్మాయిలు మొదలు వివాహితల వరకు.. అతని ట్రాప్‌లో పడ్డవారి వీడియోలు లీక్..

ఇటీవల సెల్‌ఫోన్ రిపేరింగ్ నేర్చుకోవడానికి అతని వద్ద ఓ యువకుడు చేరాడు. అతని సెల్‌ఫోన్‌లో అశ్లీల వీడియోలు ఉండటాన్ని గమనించాడు. అతను గమనించని సమయంలో వాటిని తన సెల్‌ఫోన్‌లోకి పంపించుకున్నాడు.వాటిని మరికొందరికి షేర్ చేయడంతో.. ఓ వ్యక్తి ఆ డేటా మొత్తం సేకరించాడు.

news18-telugu
Updated: July 2, 2019, 3:18 PM IST
టీనేజీ అమ్మాయిలు మొదలు వివాహితల వరకు.. అతని ట్రాప్‌లో పడ్డవారి వీడియోలు లీక్..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
పలువురు మహిళలు, యువతులను ట్రాప్ చేసి వారితో సంబంధాలు నెరిపిన ఓ యువకుడు..వాళ్లతో ఏకాంతంగా గడిపిన వీడియోలను రహస్యంగా సెల్‌ఫోన్‌లో చిత్రీకరించాడు.అప్పుడప్పుడు వాటిని చూస్తూ ఆనందిస్తుండేవాడు. అయితే అతని సెల్‌ఫోన్‌లో ఆ వీడియోలు ఉండటాన్ని గమనించిన ఓ యువకుడు.. అతనికి తెలియకుండా వాటిని తన సెల్‌ఫోన్‌లోకి పంపించుకున్నాడు.వాటిని మరికొందరికి వాట్సాప్ ద్వారా షేర్ చేశాడు. దీంతో ఈ డేటా మొత్తం సేకరించిన ఓ వ్యక్తి డబ్బు కోసం అతన్ని బ్లాక్‌మెయిల్ చేయడం మొదలుపెట్టాడు.అతను డబ్బులు ఇవ్వకపోయేసరికి ఇటీవలే కొన్ని వీడియోలు లీక్ చేశాడు. బాధిత యువతి ఒకరు ఇటీవల పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగుచూసింది.

వివరాల్లోకి వెళ్తే.. మొగల్తూరు సమీపంలోని ఓ గ్రామానికి చెందిన యువకుడు సెల్‌ఫోన్ రిపేరింగ్ చేస్తూ ఉపాధి పొందుతున్నాడు. ఈ క్రమంలో పలువురు మహిళలు, యువతుల సెల్‌ఫోన్ నంబర్స్ తీసుకుని వారితో సంబంధాలు ఏర్పరుచుకున్నాడు. అందులో టీనేజీ అమ్మాయిలు మొదలు వివాహితలు కూడా ఉన్నారు.వారితో ఏకాంతంగా గడిపిన సమయంలో రహస్యంగా వీడియోలు చిత్రీకరించాడు. ఒక్కడే ఉన్నప్పుడు వాటిని చూస్తూ ఆనందిస్తుండేవాడు.ఇటీవల సెల్‌ఫోన్ రిపేరింగ్ నేర్చుకోవడానికి అతని వద్ద ఓ యువకుడు చేరాడు. అతని సెల్‌ఫోన్‌లో అశ్లీల వీడియోలు ఉండటాన్ని గమనించాడు. అతను గమనించని సమయంలో వాటిని తన సెల్‌ఫోన్‌లోకి పంపించుకున్నాడు.వాటిని మరికొందరికి షేర్ చేయడంతో.. ఓ వ్యక్తి ఆ డేటా మొత్తం సేకరించాడు.అప్పటినుంచి దాని బాధ్యుడిని డబ్బుల కోసం బ్లాక్‌మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. అతను డబ్బులు ఇవ్వకపోవడంతో ఇటీవల కొన్ని వీడియోలు లీక్ చేశాడు. అందులో గ్రామానికి చెందిన పలువురు మహిళలు, యువతులు ఉండటంతో ఆ వీడియోలు సంచలనం రేపాయి.

తాజాగా ఓ బాధితురాలు స్థానిక పోలీసులను ఆశ్రయించడంతో పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.సెల్‌ఫోన్ రిపేరింగ్ చేసే యువకుడు అనిశెట్టి సాయితో పాటు అతని వద్ద చేరిన అసిస్టెంట్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం దీనిపై లోతుగా విచారణ జరుపుతున్నారు. దీని వెనకాల ఐదుగురు వ్యక్తుల ముఠా ఉన్నట్టుగా అనుమానిస్తున్నారు. విచారణ పూర్తయితే పూర్తి వివరాలు బయటకొచ్చే అవకాశం ఉంది.

First published: July 2, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు