యువతిని ప్రేమ పేరుతో మోసం చేసి...చివరికి ఏంచేశాడంటే...

ఇద్దరూ కొంతకాలం పాటు చాటింగ్‌తో పాటు వీడియో కాల్స్ కూడా చేసుకోవడం ప్రారంభించారు. వీడియో కాల్స్ సందర్భంగా యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమె నగ్న వీడియోలు, ఫోటోలు సంపాదించాడు.

news18-telugu
Updated: August 26, 2019, 4:35 PM IST
యువతిని ప్రేమ పేరుతో మోసం చేసి...చివరికి ఏంచేశాడంటే...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ప్రేమ పేరిట యువతిని ట్రాప్ చేసి అనంతరం ఆమెతో చనువు పెంచుకొని, చివరికి బ్లాక్‌మెయిల్ చేసాడో వ్యక్తి.. వివరాల్లోకి వెళితే గడ్డం జగదీష్ అనే నిందితుడు విజయవాడకు చెందిన ఓ యువతితో చాటింగ్ ద్వారా స్నేహం చేశాడు. ఇద్దరూ కొంతకాలం పాటు చాటింగ్‌తో పాటు వీడియో కాల్స్ కూడా చేసుకోవడం ప్రారంభించారు. వీడియో కాల్స్ సందర్భంగా యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమె నగ్న వీడియోలు, ఫోటోలు సంపాదించాడు. ఆ తర్వాత యువతిని బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు. వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టి పరువు తీస్తానని బెదిరించాడు. దీంతో నిందితుడి బ్లాక్ మెయిల్ కారణంగా బాధితురాలు తీవ్ర మనోవేదకు గురవ్వడంతో పాటు లైంగిక వేధింపులు కూడా ఎదుర్కొంది. అంతేకాదు యువతి నుంచి డబ్బులు కూడా వసూలు చేయడం ప్రారంభించాడు.

చివరకు ఆ యువతి కుటుంబ సభ్యులకు విషయం తెలియడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడు పరారీలో ఉన్నాడని, వెంటనే అతడిని అదుపులో తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
First published: August 26, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading