లేడీ కానిస్టేబుల్‌ అభ్యంతరకర వీడియో ఇంటర్నెట్‌లో.. యువకుడిని చెట్టుకు కట్టేసి..

ప్రేమించిన యువతినే లైంగిక వేధింపులకు గురిచేసిన యువకుడిని చెట్టుకు కట్టేసి సజీవ దహనం చేసిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది.

news18-telugu
Updated: June 3, 2020, 9:25 AM IST
లేడీ కానిస్టేబుల్‌ అభ్యంతరకర వీడియో ఇంటర్నెట్‌లో.. యువకుడిని చెట్టుకు కట్టేసి..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ప్రేమించిన యువతినే లైంగిక వేధింపులకు గురిచేసిన యువకుడిని చెట్టుకు కట్టేసి సజీవ దహనం చేసిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ప్రతాప్‌గఢ్‌ జిల్లా భుజైనికి చెందిన అంబికా ప్రసాద్ పటేల్(25) ఓ యువతిని ప్రేమించాడు. వారిద్దరిది ఒకే గ్రామం. అయితే, యువతికి పోలీస్ కానిస్టేబుల్‌గా కాన్పూర్‌లో విధులు నిర్వహిస్తోంది. వీళ్ల ప్రేమ గురించి పెద్దలకు తెలియడంతో గొడవలు జరిగాయి. మూడు నెలల క్రితం ఆ యువతికి సంబంధించిన అభ్యంతరకర వీడియో సోషల్ మీడియాలో చేరడంతో గొడవలు తారస్థాయికి చేరాయి. ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ యువకుడిని జైలుకు పంపారు. ఇటీవలే జైలు నుంచి విడుదలయ్యాడు. ఈ విషయం తెలిసిన యువతి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కలిసి అతడ్ని ఇంట్లోంచి లాక్కెళ్లారు.

ఓ చెట్టుకు కట్టేసి సజీవ దహనం చేశారు. స్థానికంగా సంచలనం రేపిన ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే, ఏవో కారణాల రీత్యా ఘటనాస్థలికి వెళ్లడానికి మాత్రం పోలీసులు వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది.
First published: June 3, 2020, 9:25 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading