దారుణం.. బావమరిది కుటుంబంపై పెట్రోల్ పోసి నిప్పంటించిన బావ
గురువారం రాత్రి ఒంటి గంట సమయంలో బావమరిది ఇంటివద్దకు చేరుకుని నిద్రిస్తున్న వ్యక్తులపై పెట్రోల్ చల్లి నిప్పంటించాడు. ఈ ఘటనలో నిందితుడి భార్య రాజేశ్వరి, మిగతా కుటుంబ సభ్యులు రాజు, విమల, పవిత్ర, సునీత, చింటూలకు తీవ్ర గాయాలయ్యాయి.
news18-telugu
Updated: November 22, 2019, 11:07 AM IST

గురువారం రాత్రి ఒంటి గంట సమయంలో బావమరిది ఇంటివద్దకు చేరుకుని నిద్రిస్తున్న వ్యక్తులపై పెట్రోల్ చల్లి నిప్పంటించాడు. ఈ ఘటనలో నిందితుడి భార్య రాజేశ్వరి, మిగతా కుటుంబ సభ్యులు రాజు, విమల, పవిత్ర, సునీత, చింటూలకు తీవ్ర గాయాలయ్యాయి.
- News18 Telugu
- Last Updated: November 22, 2019, 11:07 AM IST
సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలోని ఖమ్మంపల్లి గ్రామంలో దారుణం జరిగింది. భార్యపై కక్షతో ఓ వ్యక్తి తన బావమరిది ఇంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. గురువారం రాత్రి ఒంటి గంట సమయంలో బావమరిది ఇంటివద్దకు చేరుకుని నిద్రిస్తున్న వ్యక్తులపై పెట్రోల్ చల్లి నిప్పంటించాడు. ఈ ఘటనలో నిందితుడి భార్య రాజేశ్వరి, మిగతా కుటుంబ సభ్యులు రాజు, విమల, పవిత్ర, సునీత, చింటూలకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం వీరంతా సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం వారిని హైదరాబాద్లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు
పోలీసులు తెలిపారు. కొన్నాళ్లుగా భార్యాభర్తల మధ్య నెలకొన్న తగాదాలే ఘటనకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.
పోలీసులు తెలిపారు. కొన్నాళ్లుగా భార్యాభర్తల మధ్య నెలకొన్న తగాదాలే ఘటనకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.
Loading...