పెళ్లి విందులో భోజనం అయిపోయిందని.. వంట మనిషిపై సలసలా కాగుతున్న నూనె పోసి..

అప్పటికే వంటకాలన్నీ అయిపోవడంతో.. వంట మినిషి బాబాని అడిగారు. అన్నీ అయిపోయాయన్నా.. అని అతడు సమాధానం చెప్పడంతో వారు కోప్పడ్డారు. జిలానీ అనే వ్యక్తి బాబాతో గొడవపెట్టుకున్నాడు.

అప్పటికే వంటకాలన్నీ అయిపోవడంతో.. వంట మినిషి బాబాని అడిగారు. అన్నీ అయిపోయాయన్నా.. అని అతడు సమాధానం చెప్పడంతో వారు కోప్పడ్డారు. జిలానీ అనే వ్యక్తి బాబాతో గొడవపెట్టుకున్నాడు.

  • Share this:
    అది పెళ్లి విందు కార్యక్రమం. ఇరు కుటుంబాల బంధువులు, స్థానికులు అంతా తరలి వచ్చారు. తిని వెళ్లిపోయారు. కానీ కొందరు మాత్రం రిసెప్షన్ పార్టీకి ఆలస్యంగా వచ్చారు. ఐతే అప్పటికే అన్ని ఆహార పదార్థాలు అయిపోయాయి. ఏవీ లేవు అన్నా.. అని వంట మనిషి చెప్పాడు. అంతే ఆ సమాధానమే వారికి కోపం తెప్పించింది. వేడి వేడి నూనెతో అతడిప పోయడంతో తీవ్ర గాయాలయ్యాయి. కామారెడ్డిలో ఈ ఘటన జరిగింది. స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎన్ఆర్ గార్డెన్‌లో మంగళవారం రాత్రి ఒక విందు జరిగింది.

    బంధు మిత్రుల సందడితో అక్కడ కోలాహలం నెలకొంది. అందరూ ఎంతో సంతోషంగా విందు ఆరగించారు. ఐతే కొంతమంది బంధువులు ఆలస్యంగా వచ్చారు. కానీ అప్పటికే వంటకాలన్నీ అయిపోవడంతో.. వంట మినిషి బాబాని అడిగారు. అన్నీ అయిపోయాయన్నా.. అని అతడు సమాధానం చెప్పడంతో వారు కోప్పడ్డారు. జిలానీ అనే వ్యక్తి బాబాతో గొడవపెట్టుకున్నాడు. మాటా మాటా పెరగడంతో జిలానీ రెచ్చిపోయాడు. అక్కడే పొయ్యిపై వేడి నూనెను బాబాపై పోశాడు. ఆ నూనె అప్పటికే సలాసలా కాగుతూ ఉండడంతో బాబాకు తీవ్ర గాయాలయ్యాయి. అతడిని కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. జిలానీని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
    Published by:Shiva Kumar Addula
    First published: