ఏడో అంతస్థు నుంచీ మూడేళ్ల పాపను విసిరేశాడు... ముంబైలో జరిగిన దారుణం

Mumbai : స్నేహితుడి మూడేళ్ల కూతుర్ని అపార్ట్‌మెంట్‌లోని ఏడో అంతస్థు నుంచీ కిందకు ఎందుకు విసిరేశాడన్నది పోలీసుల్ని ఆశ్చర్యపరిచింది.

Krishna Kumar N | news18-telugu
Updated: September 8, 2019, 9:02 AM IST
ఏడో అంతస్థు నుంచీ మూడేళ్ల పాపను విసిరేశాడు... ముంబైలో జరిగిన దారుణం
ప్రతీకాత్మక చిత్రం
Krishna Kumar N | news18-telugu
Updated: September 8, 2019, 9:02 AM IST
ముంబై... కొలాబాలోని... రేడియో క్లబ్ దగ్గర్లో... అశోకా అపార్ట్‌మెంట్ బ్లాక్ Aలో జరిగిందీ దారుణం. రాత్రి 7న్నరకు... అపార్ట్‌మెంట్ కింద దబ్ మని సౌండ్ వచ్చింది. అందరూ ఏంటా అని చూశారు. రక్తపు మడుగులో మూడేళ్ల చిన్నారి కనిపించింది. అందరూ షాక్ అయ్యారు. తీవ్ర గాయాలపాలైన చిన్నారి... అక్కడికక్కడే చనిపోయింది. ఆ చిట్టితల్లి శరీర భాగాలు ముక్కలైపోయిన దృశ్యం చూసి... అక్కడి వాళ్లంతా... తీవ్ర ఆవేదన చెందారు. ఆ పిల్ల... ఏడో అంతస్థులో ఉండే... షనాయా అని గుర్తించారు ఒకరు. కిటికీ లోంచీ కింద పడిందని వాళ్లకు అర్థమైంది. మూడేళ్ల పాప... అంత ఎత్తు కిటికీ ఎక్కలేదని గ్రహించిన వాళ్లు... మొత్తం అపార్ట్‌మెంట్‌ని బ్లాక్ చేశారు. లోపలున్నవాళ్లెవరూ... బయటకు వెళ్లనివ్వకుండా... గేట్లు క్లోజ్ చేశారు.

పావు గంట తర్వాత పోలీసులు ఎంటరయ్యారు. అప్పటికే స్థానికులకు విషయం అర్థమైంది. షయానా తండ్రికి స్నేహితుడు 40 ఏళ్ల అనిల్ చుగానీ. అతనే... ఏడో అంతస్థులో ఆడుకుంటున్న పాపను బలవంతంగా ఎత్తుకొని... కిటికీ లోంచీ కిందకు విసిరేశాడని అర్థమైంది. ఆ సమయంలో... షయానా... మరో ఇద్దరు పిల్లలతో కలిసి ఆడుకుంటోంది. ఏం పాపం చేసిందని ఆ చిట్టితల్లిని అంత క్రూరంగా విసిరేశాడన్నది తెలియలేదు. పోలీసులు అనిల్ చుగానీని అరెస్టు చేశారు. ఇంటరాగేషన్‌లో పూర్తి వివరాలు తెలిసే అవకాశాలున్నాయి. కానీ ఈ ఘటన... మొత్తం అపార్ట్‌మెంట్ వాసుల్ని కన్నీటిపర్యంతం చేసింది. రోజూ చక్కగా ఆడుకుంటూ తిరిగే పసి పాప... అత్యంత దయనీయ స్థితిలో చనిపోవడం వాళ్లను కలచివేసింది.

First published: September 8, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...