ఆలుమగలన్నాక కోపాలు, గొడవలు (Family disputes) కామన్. వీటిని మాట్లాడి పరిష్కరించుకోవాలి. కానీ కొందరు క్షణికావేశంలో దారుణాలకు పాల్పడుతున్నారు. తమ పంతం నెగ్గించుకొవడానికి ఎంతకైన తెగిస్తున్నారు. కొన్ని చోట్ల భర్తలు, తమ భార్యలపై కొడుతూ.. దాడులకు పాల్పడుతున్నారు. మరికొన్ని చోట్ల మహిళలు.. తామేం తక్కువ కాదన్నట్లు భర్తలపై అడ్డమైన కేసులు పెడుతూ.. వారిని ముప్పుతిప్పలు పెడుతున్నారు. కొన్ని చోట్ల తమ ప్రేమను (Love) అంగీకరించలేదని, పెళ్లి తర్వాత గొడవల వలన మహిళలు, అమ్మాయిలపై యాసీడ్ తో దాడికి పాల్పడిన అనేక సంఘటనలు వార్తలలో నిలిచాయి. ఈ కోవకు చెందిన ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
పూర్తి వివరాలు.. బెంగళూరులో (Bengaluru) గత నెలలో దారుణం జరిగింది. ప్రస్తుతం ఆ ఘటన మరోసారి వార్తలలో నిలిచింది. నగేష్ అనే వ్యక్తి తన భార్యతో తరచుగా గొడవ పడేవాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్యగొడవలు (disputes) తారా స్థాయికి చేరాయి. దీంతో నగేష్ కోపం పట్టలేక యాసిడ్ (Acide attack) తీసుకొచ్చాడు. తన భార్యపై యాసీడ్ తో (Acide attack on wife) దాడిచేశాడు. మహిళకు కొద్దిపాటు గాయాలు మాత్రమే అయ్యాయి. వెంటనే మహిళ స్థానిక పోలీస్ స్టేషన్ వెళ్లితన భర్తపై ఫిర్యాదు చేసింది.
అప్పటి నుంచి నిందితుడు పరారీలో ఉన్నాడు. నిందితుని కోసం పోలీసులు గాలిస్తునే ఉన్నారు. ఈ క్రమంలో నిందితుడు తమిళనాడులోని (Tamil nadu) ఒక ఆశ్రమంలో ఉన్నట్లు పోలీసులకు తెలిసింది. వెంటనే వారు..ప్రత్యేక పోలీసులతో కలిసి తిరువణ్ణామలై జిల్లాలో వేలూరు సమీపానికి చేరుకున్నారు. అక్కడ ఒక ఆశ్రమం ఉంది. అక్కడ నగేష్ బాబా అవతారమెత్తాడు. దీంతో.. నగేష్ ను స్థానిక పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
Published by:Paresh Inamdar
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.