Home /News /crime /

MAN THEFT PROPERTY OF HER WIFE WITH THE HELP OF MASK POSES ANOTHER WOMAN AS HIS WIFE IN REGISTRATION OFFICE AK

వీడు సామాన్యుడు కాదు.. మాస్క్‌ను అడ్డుపెట్టుకుని ఆస్తి కొట్టేశాడు.. పోలీసులు, అధికారులు అంతా షాక్.. అసలేం జరిగిందంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కరోనా సమయంలోనే కొంత సేపు మాస్క్ తీసి రిజిస్ట్రేషన్ ప్రక్రియలో పాల్గొనే వ్యక్తుల ఫోటోలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. దీంతో ఈ మొత్తం వ్యవహారంలో రిజిస్ట్రేషన్ కార్యాలయ సిబ్బంది పాత్రపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.

    కరోనా నుంచి మనల్ని మనం రక్షించేందుకు మాస్క్ తప్పనిసరి. మాస్క్ లేకపోతే వేలల్లో జరిమానాలు విధిస్తున్నారు. అయితే కొందరు కేటుగాళ్లు మాస్క్‌ను అడ్డుపెట్టుకుని మోసాలకు పాల్పడుతున్నారు. పుణెకు చెందిన ఓ మహా మాయగాడు.. మాస్క్ నిబంధనను అడ్డుపెట్టుకుని తన భార్య పేరు మీద ఉన్న ఆస్తి మొత్తాన్ని తన పేరు మీదకు రాయించుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే పుణెకు చెందిన రాహుల్ జాదవ్, కవిత జాదవ్ భార్యాభర్తలు. రాహుల్ జాదవ్‌తో పాటు కవిత జాదవ్ పేరు మీద ఓ ఫ్లాట్, ఓ షాపు ఉన్నాయి.

    అయితే తన భార్య పేరు మీద ఉన్న ఆస్తిని తన పేరు మీదకు రాయించుకోవాలని ప్లాన్ చేసిన రాహుల్ జాదవ్.. ఇందుకోసం ఎవరూ ఊహించని విధంగా చేశాడు. మరో మహిళకు మాస్క్ పెట్టి రిజిస్ట్రేషన్ ఆఫీసుకు తీసుకెళ్లాడు. తన భార్య ఆస్తికి సంబంధించిన అసలు డాక్యుమెంట్లను తీసుకెళ్లి.. మాస్క్ పెట్టుకున్న మహిళే తన భార్యగా అక్కడి వారిని నమ్మించాడు. దీంతో రిజిస్ట్రేషన్ కార్యాలయ సిబ్బంది.. కవిత జాదవ్ పేరు మీద ఉన్న ఆస్తిని రాహుల్ జాదవ్ పేరు మీదకు బదలాయించారు.

    ఇందుకు సంబంధించి కవిత జాదవ్‌కు నోటీసులు రావడంతో అసలు కథ వెలుగులోకి వచ్చింది. వెంటనే ఆమె పోలీసులను సంప్రదించింది. అయితే కరోనా సమయంలోనే కొంత సేపు మాస్క్ తీసి రిజిస్ట్రేషన్ ప్రక్రియలో పాల్గొనే వ్యక్తుల ఫోటోలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. దీంతో ఈ మొత్తం వ్యవహారంలో రిజిస్ట్రేషన్ కార్యాలయ సిబ్బంది పాత్రపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. మరోవైపు తన మోసం బయటపడటంతో ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు రాహుల్ జాదవ్.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Crime news, Husband, Wife

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు