HOME »NEWS »CRIME »man takes life in dubai two days after girlfriend commits suicide hsn

ప్రేయసి ఆత్మహత్య.. రెండ్రోజుల తర్వాత దుబాయిలో ఉన్న ప్రియుడికి తెలిసి.. ఏం చేశాడో తెలిస్తే..

ప్రేయసి ఆత్మహత్య.. రెండ్రోజుల తర్వాత దుబాయిలో ఉన్న ప్రియుడికి తెలిసి.. ఏం చేశాడో తెలిస్తే..
మనీషా, రాకేశ్ (ఫైల్ ఫొటోలు)

డబ్బు సంపాదిస్తే ప్రేయసితో పెళ్లికి పెద్దలు ఒప్పుకుంటారని ఆ ప్రియుడు భావించాడు. దుబాయికి వెళ్లాడు. కానీ ఈ లోపే ఆ ప్రేయసికి పెద్దలు ఓ పెళ్లి సంబంధం చూశారు. ప్రియుడిని మర్చిపోలేక ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఆ విషయం దుబాయిలో ఉన్న ప్రియుడికి తెలిసి..

  • Share this:
    వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలనీ, మంచి కుటుంబాన్ని కలిగి ఉండాలని కలలు కన్నారు. డబ్బు సంపాదిస్తే ప్రేయసిని ఇచ్చి తనకు పెళ్లి చేయడానికి వారి తల్లిదండ్రులు అంగీకరిస్తారన్న నిర్ణయానికి ఆ ప్రియుడు వచ్చాడు. దుబాయికి వెళ్తే తక్కువ కాలంలోనే ఎక్కువ డబ్బు సంపాదించొచ్చని స్నేహితుల ద్వారా విన్నాడు. తెలిసిన వాళ్ల ద్వారా దుబాయి బాట పట్టాడు. అక్కడకు వెళ్లినా రోజూ, ప్రేయసితో ఫోన్లో మాట్లాడుతూనే ఉన్నాడు. అయితే అనుకోకుండా ఆ యువతికి ఓ పెళ్లి సంబంధం చూశారు. తన ప్రేమ గురించి ఇంట్లో చెప్పేందుకు ఆ అమ్మాయి భయపడటంతో పెద్దలు పెళ్లిని కూడా నిశ్చయించేశారు. అయితే ప్రియుడిని మర్చిపోలేక, పెద్దలు చూసిన పెళ్లిని చేసుకోలేక ఆ అమ్మాయి తీవ్ర మనోవేధనకు గురయింది. చివరకు ఇంట్లోనే ఉరేసుకుని చనిపోయింది.

    ఈ విషయం తెలిసిన ప్రియుడు కూడా దుబాయిలో ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రేయసి లేని లోకంలో తాను కూడా ఉండలేనని తనువు చాలించాడు. తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే.. జగిత్యాల జిల్లాలోని గొల్లపల్లి మండలం లక్ష్మీపూర్‌కు చెందిన రాకేష్, గోవిందుపల్లికి చెందిన మనిషా ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుందామనుకున్నారు. అయితే డబ్బు సంపాదన కోసం ఏడాది క్రితం రాకేష్ దుబాయి వెళ్లాడు. అప్పటి నుంచి ప్రేయసితో ఫోన్లో మాట్లాడుతూనే ఉన్నాడు. త్వరలో వస్తాననీ,పెళ్లి చేసుకుందామని చెబుతూ వచ్చాడు. అయితే వారి ప్రేమ విషయాన్ని పెద్దలకు తెలియజేయపోవడం జరగరాని ఘోరం జరిగిపోయింది. యువతి తల్లిదండ్రులు ఆమెకు ఓ పెళ్లి సంబంధాన్ని నిశ్చయం చేశారు.





    పెద్దలకు తమ ప్రేమ గురించి చెప్పలేక మనీషా తీవ్ర మనోవేధనకు గురయింది. ప్రియుడిని మోసం చేసి మరో వ్యక్తితో జీవితాన్ని పంచుకోలేకపోయింది. దీంతో రెండ్రోజుల క్రితం గోవిందుపల్లిలోనే తన ఇంట్లో మనీషా ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ప్రేయసి మరణవార్త గురించి రాకేష్ కు కాస్త ఆలస్యంగా తెలిసింది. దీంతో అతడు తీవ్రంగా బాధపడ్డాడు. ప్రేయసి తన కోసమే చనిపోయిందనీ, ఆమె లేని లోకంలో తాను ఉండలేననీ ఆవేదన చెందాడు. తన ఆవేదనను ఓ సెల్ఫీ వీడియోలో తల్లికి రికార్డు చేసి పంపించాడు. ఆ తర్వాత దుబాయిలో తాను ఉంటున్న రూమ్ లోనే ఉరేసుకుని చనిపోయాడు. ప్రియుడు రాకేష్ వీడియో గ్రామంలో వైరల్ గా మారింది. ఈ ఘటన రెండు ఊళ్లల్లో చర్చనీయాంశంగా మారింది. క్షణికావేశంతో ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడిందనీ, తల్లిదండ్రులకు చెప్పి ఉంటే పరిస్థితి ఏమైనా మారేదనీ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
    Published by:Hasaan Kandula
    First published:January 23, 2021, 20:11 IST

    टॉप स्टोरीज